కోమటిరెడ్డి బ్రదర్స్... డబుల్ ధమాకా !

Update: 2018-12-12 16:36 GMT
ఆయన పరాజయం పాలై 48 గంటలు కాలేదు. ఆయన ఓటమి చవి చూసి రెండు రోజులు కాలేదు. అయిన మళ్లీ ఎన్నికల బరిలో నిలబడతానంటున్నారు. ఇప్పట్లో తెలంగాణ శాసన సభకు ఎన్నికలూ లేవు. ఉన్నద‌ల్లా పంచాయితి ఎన్నికలే. మంత్రిగా ఎమ్యెల్యేగా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన పంచాయితి ఎన్నికలలో పోటీ చేయడమేమిటి అనుకుంటున్నారా.... మేము చెప్పేది కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఆయ‌న‌కేం క‌ర్మ అనుకోకండి. ఆయన పోటీ చేసేది  పంచాయితీ ఎన్నికలు కాదు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో లోక్‌ సభకు పోటీ చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు రాజగోపాల రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఈ ఇద్దరు సోదరులు పోటీ చేశారు. అయితే కోమటిరెడ్డి  వెంకట రెడ్డి పరాజయం పాలయ్యారు. రాజగోపాల రెడ్డి మాత్రం విజయం సాధించారు. భువనగిరి లోక్‌ సభ సభ్యుడిగా ఉన్న రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన లోక్‌ సభ సభ్యుడి పదవికి రాజీనామ చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల సమయమే ఉండడంతో భువనగిరిలో ముందస్తు ఎన్నికలు రావు. దీంతో తన భువనగిరి లోక్‌ సభ స్దానం నుంచి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని రాజగోపాల రెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి సోదరులు తొలి నుంచి పెద్ద ఎసెట్‌ గానే ఉన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఎదుర్కోవడంలో ఈ సోదరుల పాత్ర చాలా ఉంది. దీనిని గుర్తించిన కాంగ్రెస్ అదిష్టానం కోమటిరెడ్డి సోదరులకు వారి అనుచరులకు టిక్కెట్లు ఇచ్చింది. నల్గొండ జిల్లా నకిరేకల్ నుంచి కోమటిరెడ్డి సోదరుల ప్రధాన అనుచరులు చిరుమర్తి లింగయ్యాకు టిక్కెట్టు రాకూడదని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ప్రయత్నించారు. అయిన కోమటిరెడ్డి సోదరులు ఆయనకు టిక్కెట్టు ఇప్పించడంలో సఫలంమయ్యారు. అంతేకాదు తెలంగాణ రా‌ష్ట్ర సమితి ప్రభంజనంలో చిరుమర్తి లింగయ్య కొట్టుకుపోకుండా విజయం సాధించారు. ఇది నల్గొండ జిల్లాలో సంచలనమే. ఆ దీమాతోనే రానున్న లోక్‌ సభ ఎన్నికలలో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారని రాజగోపాల రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యంగా రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా వినతి చేస్తామని లోక్‌ సభ కాంగ్రెస్ టిక్కెట్టు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంటామని కోమటిరెడ్డి సోదరుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

   

Tags:    

Similar News