ఈ ప్రశ్న విని ఆశ్చర్యపోతున్నారా...? ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటారు కానీ, జిల్లాకు ఎందుకు ఉంటారు అనుకుంటున్నారా? కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు వింటే అసలు విషయం అర్థమవుతుంది. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు మెదక్ జిల్లాకు మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాకే సీఎంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సచివాలయానికి వచ్చిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు వాగ్దానాలు చేస్తున్నా నిధులు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయింపు ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఎస్ ఎల్ బీసీ సొరంగం ఎందుకు ఆలస్యమైందని టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వెంకటరెడ్డి నిలదీశారు.
కేసీఆర్ తాను చదువుకున్న పాఠశాల పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించడం... ఇతర కేటాయింపుల్లోనూ మెదక్ జిల్లాకే అగ్రతాంబూలం ఇస్తుండడంతో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.సొంత జిల్లాపై ఎవరికైనా ప్రేమ ఉంటుందని... అంతమాత్రాన ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మిగతా జిల్లాలను పట్టించుకోకపోతే ఎలా అని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు.