`రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతా. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా చేప్పానని.. ఆయన కూడా ఓకే చెప్పారు`` అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల నుంచి ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నానని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ఆయన స్పష్టం చేశారు. అయితే దాదాపు పది రోజుల వ్యవధిలోనే ఆయన స్టాండ్ మార్చారు. రాహుల్ గాంధీ ఆదేశిస్తేనే....పోటీ చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చారు.
తన అనుచరుడు అయిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోమటిరెడ్డి ప్రసంగిస్తూ... సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల హామీలు ఇంకా అలాగే ఉన్నాయని, ఇప్పుడైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. పెంచిన పెన్షన్లను ఇప్పటి నుంచే అమలు చేయాలని, పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోమటిరెడ్డి అన్నారు. నాకు పదవి ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసమే పనిచేస్తానని తెలిపారు. గత ఇరవై సంవత్సరాలు నిజాయితీతో పని చేసినందునే ప్రజలు తనను గుర్తుంచుకున్నారని అన్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ స్ధానం నుంచి బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
నల్లగొండలో సీఎం కేసీఆర్ పోటీ చేసినా.. ఏ రావు పోటీ చేసినా ఓటమి తప్పదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నల్లగొండలో సీఎం కేసీఆర్ సర్వే చేయించుకొని ఓటమి తప్పదని వెనక్కి తగ్గి.. మరో వ్యక్తిని పోటీలో పెట్టాడని విమర్శించారు. నల్లగొండలో పోటీ చేస్తానన్న వ్యక్తి ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. కేసీఆర్ నల్లగొండకు ఎన్నిసార్లు వచ్చినా.. నా గెలుపును అడ్డుకోలేరని అన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు.