అసెంబ్లీలో మైక్ విరిచేసి..కోమ‌టిరెడ్డి ర‌చ్చ‌.

Update: 2018-03-12 08:04 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొద‌టి రోజు తీవ్ర ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య మొద‌ల‌య్యాయి. స‌భ ప్రారంభం కాగానే నిరసన పేరుతో కాంగ్రెస్ శాసనసభ్యులు వీరంగం సృష్టించారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా పేపర్లు - పెన్నులు గవర్నర్‌ పైకి విసిరారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు - సీనియ‌ర్ నేత‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేశారు. స‌భ‌లో ఉప‌యోగించే మైక్ హెడ్‌ ఫోన్‌ ను గవర్నర్‌ పైకి విసరిరారు. అయితే అది గాంధీ ఫోటోకు తగిలి దాని కింద ఉన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ పై పడింది. దీంతో స్వామిగౌడ్‌ కు తీవ్రంగా గాయమైనట్లు సమాచారం. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో స్వామిగౌడ్‌ కు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అనంత‌రం కోమటిరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేసీఆర్ త‌న‌ను బలి ఇవ్వాలని చూస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. అందరికి టార్గెట్ తానేన‌ని వ్యాఖ్యానించారు. `మా జిల్లాలో రెడ్లు - సెటిలర్స్ ఎక్కువ. కేసీఆర్ నల్గొండ నుండి పోటీచేస్తే నేను ఇంట్లో కూర్చున్నా గెలుస్తాను. రెడ్లు ఎవరు టీఆర్ ఎస్‌ కు ఓటు వేయ‌రు. ఈసారి నాయినికి కూడా రెడ్లు ఓటు వేసే చాన్స్ లేదు` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నుండి పోటీచేయాలని కోరితే తాను రెడీ అని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. గ‌జ్వేల్‌ లో కేసీఆర్ కంటే త‌నకే ఎక్కువ బంధువులు ఉన్నారని ఆయ‌న వివ‌రించారు.
Tags:    

Similar News