కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరిగా పేరున్న నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీలో అంతర్గత దూకుడు తగ్గించిన కోమటిరెడ్డి అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రకటనలు క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నాయని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని వదిలేది లేదని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతలోనే మాట మార్చారు. తాను నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ - నల్లగొండ అసెంబ్లీ స్థానాలను యువకులకు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతానన్నారు. వారం రోజులు తిరుగక ముందే విభిన్న ప్రకటనలు చేసిన కోమటిరెడ్డి తీరు ఆ పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తున్నది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని వీడేది లేదని చెప్పిన ఆయన.. తిరిగి నల్లగొండ పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటించడంతో క్యాడర్ విస్మయానికి గురైంది.
రాష్ట్రంలో సాగుతోన్న ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్యచేశారని ఆరోపించారు.