ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఎపిసోడ్ తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రిపైనా.. ఏపీ అధికారపక్షంపైనా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సంచలనం సృష్టించాయి. కృష్ణారావు పెట్టిన పోస్టింగులపై మీడియాలో ప్రముఖంగా వచ్చిన తర్వాత.. ఆఘమేఘాల మీద స్పందించిన సీఎం చంద్రబాబు.. ఆయన్ను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారపక్ష నేతలు ఐవైఆర్ మీద పలు విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే.. ఐవైఆర్ ఉందతం.. ఏపీ అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఐవైఆర్ మీద తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మీద తీవ్రంగా మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోనా రఘుపతి. తాజాగా జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు. డిసెంబరులో లక్షలాది మంది బ్రాహ్మణులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్ పై విమర్శిస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేశారని.. తాజా ఉదంతంలో ఐవైఆర్ మీద చులకన చేస్తూ పోస్టులు పెట్టారని.. మరి అలాంటి వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని.. ఆయనకు బ్రాహ్మణులు కచ్ఛితంగా బుద్ధి చెబుతారన్నారు. పలువురు బ్రాహ్మణ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/