అనవసరమైన వ్యాఖ్యలు చేయకపోవటం.. హుందాగా వ్యవహరించటం.. రాజకీయాల పేరిట యాగీ సృష్టించటం లాంటివి ఏమాత్రం సరిపోని కొణతాల రామకృష్ణకు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వీర విధేయుడిగా పేరున్న కొణతాల.. వైఎస్ క్యాబినెట్‌లో కీలక పదవిని నిర్వహించారు. ఆయన హఠ్మారణంతో పలువురు నేతలు కాంగ్రెస్‌లోనే ఉంటే.. కొందరు మాత్రం జగన్ పక్షాన చేరారు. అలాంటివారిలో కొణతాల ఒకరు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే ఉన్న ఆయన.. తర్వాత రోజుల్లో జగన్ నిర్లక్ష్యానికి.. నిరాదరణకు గురయ్యారు.
దీంతో.. తీవ్రమైన మనోవేదనతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం.. తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేశారు. అయితే.. కొణతాలకు.. దాడి వీరభద్రరావుకు పోటీ ఏర్పడటం.. ఎవరినో ఒకరినే తీసుకోవాలన్న పట్టుదలతో తెలుగుదేశంలోని ఇరువురు మంత్రులు పావులు కదపటంతో.. టీడీపీలోకి ఆయన ఎంట్రీ మధ్యలో ఆగిపోయింది.
ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చకపోవటంతో.. ఆ సమస్య అలానే ఉండిపోయింది. దీంతో.. నెలలు గడుస్తున్నా.. ఏ పార్టీలో చేరకుండా కొణతాల ఉండిపోయారు. తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలోకి తాను వస్తానన్నా.. తాత్సరం చేస్తున్న చంద్రబాబుపట్ల కొణతాల కాస్తంత కినుకు ప్రదర్శించారని చెబుతున్నారు. అదే సమయంలో..జగన్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన మళ్లీ సొంతగూటికి చేరుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పాత విషయాల్ని మనసులో పెట్టుకోవద్దని.. పార్టీలోకి తిరిగి రావాలంటూ జగన్ నుంచి ప్రతిపాదనతో ఆయన మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ.. అదే జరిగితే.. ఇరువురికి లాభదాయకమేనన్న వాదన వినిపిస్తోంది.