వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. సంచలనాలకు నిలువెత్తు రూపంగా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా కొండా సురేఖ - మురళీ దంపతుల బయోపిక్ ను స్టార్ట్ చేయటం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వర్మ స్వయంగా ప్రకటించిన ఈ మూవీ సోమవారం షురూ అయ్యింది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన వేళ.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు కొండా సురేఖ. తమ జీవిత కథ ఎంతో భిన్నమైనదని.. అందుకే వర్మ సినిమా తీయటానికి ముందుకు వచ్చారన్నారు. సినిమాలో ఎలా చూపించినా మీ ఇష్టం అంటూ మురళీధర్ రావు చేతిని వర్మ చేతికి అందించారు సురేఖ.
ఇదిలా ఉంటే.. సినిమా సక్సెస్ గురించి పెద్దగా మాట్లాడని రాంగోపాల్ వర్మ.. తాజా ‘కొండ’ మూవీ మీద మాత్రం రోటీన్ కు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తాను తీస్తున్న ఈ మూవీ శివ చిత్రాన్ని దాటిపోతుందని.. తన సినిమా జీవితంలోఒక చరిత్ర సృష్టిస్తుందన్నారు. సినిమా కొండా మురళికి పాజిటివ్ గా ఉంటుందా? లేదంటే నెగిటివ్ గా ఉంటుందా? అని చాలామంది అడిగారని.. సినిమాలో నిజాన్ని చూపిస్తానని.. పాజిటివో.. నెగిటివో ప్రేక్షకులే డిసైడ్ చేయాలని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు.. కొండా మురళీధర్ రావును ఉద్దేశించి.. మహా దమ్మున్న మగాడుగా పేర్కొన్న వర్మ.. సురేఖ వెంట మురళీధర్ రావు పడినట్లుగా..కొండా బయోపిక్ తీసేందుకు తాను ఆయన వెంట చాలా తిరగాల్సి వచ్చిందన్నారు. ఈ మూవీ తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో స్టార్ట్ అయ్యింది. సినిమా తీయటమే తన పని అని.. విజయం తన చేతుల్లో ఉండదనే వర్మ.. అందుకు భిన్నంగా భారీ అంచనాల్ని సెట్ చేసేలా మాట్లాడటం గమనార్హం. ఇదంతా కూడా.. వ్యహంలో భాగమా? అన్న భావన కలిగేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి.