తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటున్న కొందరు సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆయన నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేయడంతో పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా పార్టీలోని ముఖ్యుల్లో కొండా సురేఖ దంపతులు కూడా రేవంత్ రెడ్డికి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనపై పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని కొండా దంపతులు తమ సన్నిహితుల మధ్య వాపోయారట.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూర్లో కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాలను కొన్ని రోజుల కిందట టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసంచేసేందుకు యత్నించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన కొండా దంపతులు కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే కూడా తనపై వచ్చిన విమర్శలపై కొండా దంపతులపై ఆరోపణలు చేశారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోలేదు.
తమ నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న తమకు ఫోన్ చేయడం గానీ.. లేదా పరామర్శించడం గానీ చేయలేదని కొండా సురేఖ అనుకుంటున్నారట. దీంతో రేవంత్ రెడ్డిక కొండా సురేఖ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే కొండా దంపతుతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. హూజూరాబాద్ ఎన్నిక సమయంలో కొండా దంపతులు స్పష్టత ఇవ్వకుండా నాన్చుడు ధోరణి ప్రవర్తించారన్నారు. దీంతో పార్టీ గురించి ఇతరులు చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నా కొండా సురేఖ పట్టించుకోలేదన్నారు.
అంతేకాకుండా తమకు భూపాలపల్లి, వరంగల్ తూర్పు, హుజూరాబాద్ నియోజకవర్గాలపై హామీలు అడిగారని, అది సాధ్యమయ్యే పనికాదని రేవంత్ రెడ్డి చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో కొండా సురేఖ హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభలో ఆయనను కొండా సురేఖ పొగిడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత సీఎం అయ్యే అర్హత తనకే ఉందని చెప్పారు. ఇక తను పీసీసీ చీఫ్ అయితే వర్కింగ్ ప్రెసిడెండ్ ఇస్తానని హామీ ఇచ్చాడని కూడా చెప్పారని సురేఖ సన్నిహితులు పేర్కొంటున్నారు.
అయితే రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి కొండా సురేఖ దంపతులను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే హుజూరాబాద్ విషయంలో జరిగిన పరిణామాల వల్లే ఇలా దూరం పెరిగిందా..? అని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా తన నియోజకవర్గంలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై ఆమె సన్నిహితులు రేవంత్ రెడ్డిపై గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా..? లేదా మళ్లీ ఒక్కటవుతారా..? అని అనుకుంటున్నారు.