సురేఖ చెప్పిన కేసీఆర్ ర‌హ‌స్యాలు !

Update: 2018-12-22 14:58 GMT
ఎన్నికల్లో ఎలా గెలవాలో... ప్రత్యర్ధులను ఎలా ఓడించాలో రాజకీయ నాయకులు చక్కని లెక్కలతో చెబుతారు. ఈ లెక్కలతోనే ఏ ఎన్నికల్లోనైనా ఎవరు గెలుస్తారో... ఎవరు ఓడిపోతారో కూడా తెలిసిపోతుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం ప్రత్యేర్ధులే అధికార పార్టీలో ఎవరు ఎందుకు విజయం సాధిస్తారో... ఎవరు ఎందుకు ఓడిపోతారో చెప్తేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా. ఎలాగో మనకు తెలియదు కాని... ఇటీవల తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలైన వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖకు మాత్రం చాలా చక్కగా తెలుసు. తన భర్త కొండా మురళి శాసన మండలి సభ్వత్వానికి రాజీనామా చేసిన సందర్భంగా హైదరాబాద్ లో కొండా సురేఖ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో విజయం సాధించిన వారి గురించి - పరాజయం పాలైన వారి గురించి కొండా సురేఖ విలేకరులకు వివరించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తనకు నచ్చిన వారిని ఎలాగైనా గెలిపించుకుంటుందని - అలాగే నచ్చని వారిని ఓడిస్తుందని అన్నారు. దీనికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు నాయకుల గెలుపోటములను వివరించారు.

వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ కు క్యాబినెట్ ర్యాంక్ మంత్రిని చేసేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి జూపల్లి క్రిష్ణారావును ఓడించారని సూత్రీకరించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిద్దరు విజయం సాధిస్తే మంత్రివర్గ కూర్పులో ఇబ్బందులు వస్తాయని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం వారిలో ఒకరైన జూపల్లి క్రిష్ణారావును ఓడించిందని కొండా సురేఖ వివరించారు. పార్టీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే కొందరిని ఓడించడం... మరికొందరిని గెలిపించడం వంటివి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంపై ఆరోపణలు సంధించారు కొండా సురేఖ. ఇదంతా బాగానే ఉంది కాని... తొడగొట్టి బయటకు వచ్చిన కొండా సురేఖ తన ఓటమికి కారణాలు మాత్రం చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

   

Tags:    

Similar News