మన చుట్టూ నేతలు చాలామందే ఉంటారు. కానీ.. ఉన్నది ఉన్నట్లుగా మనసులో పెట్టుకోకుండా హార్ట్ ఫుల్ గా మాట్లాడే నేతలు చాలా చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో కొండా దంపతుల్ని వరంగల్ జిల్లా ప్రజలు చెబుతుంటారు. వారు అభిమానించినా.. ఆగ్రహించినా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మొండినతానికి మూర్తీభవించినట్లుగా ఉండే..
ఈ దంపతుల మీద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం తాజాగా జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నింటికి మించిన తమ కుటుంబానికి సంబంధించిన ఒక విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పేసి షాకిచ్చారు. ఆమె నోటి నుంచి వచ్చిన మాట లేనిపోని కేసుల ఇష్యూను తీసుకొచ్చే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది. అదేమంటే.. తన కుమార్తె గురించి చెబుతూ.. తన అత్తగారు తన కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునేవారన్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆరోగ్యం క్షీణించటం.. ఆమె కోరిక మేరకు కుమార్తె పెళ్లిని చేశామని.. పెళ్లి చేసే నాటికి ఆమె మేజర్ కాదని చెప్పేశారు. దీంతో.. వేదిక మీద ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెళ్లి ఖాయం చేసుకున్న పదిహేను రోజులకే మేజర్ అయినట్లు చెప్పారు. తమ అత్తమ్మ ఆరోగ్య పరిస్థితుల కారణంగా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పినా.. మైనర్ గా ఉన్న వేళలోనే పెళ్లి లగ్నం ఖాయం చేసుకోవటం.. ఆ విషయాన్ని తనకు తానే స్వయంగా చెప్పేసుకున్న నేపథ్యంలో కొండా సురేఖకు కేసుల చిక్కులు చిక్కునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక.. తన భర్త గురించి కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. ఆయన్ను రౌడీ ఎందుకు అంటారు? అన్న విషయంపై క్లారిటీ వచ్చేలా ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
- జేబులో రూ.50 ఉంటే.. ఎవరైనా వచ్చి అవసరమని చెబితే.. వెనుకా ముందు చూసుకోకుండా ఆ యాభై రూపాయిలు ఇచ్చేస్తారు. మరి.. మన సంగతి ఏమిటంటే.. పచ్చడి వేసుకొని తిందామని చెప్పేవారు. అలాంటి దాన గుణం ఉంది. మేం ఎప్పుడూ ప్రజలకు పెట్టాం. ప్రజలను చేయి చాచి తీసుకున్నది లేదు.
- మావో అగ్రనేత ఆర్కేను తాను చాలాసార్లు వెళ్లి కలిశానని.. తనతో పాటు తన కుమార్తెను తీసుకెళ్లేదానినని చెప్పారు. ఎప్పుడైనా కుమార్తెను తీసుకెళ్లకుండా వెళితే.. చిట్టక్క ఎలా ఉందని అడిగేవారు.
- కొండా మరళీ.. రాంగోపాల్ వర్మ అనుబంధం ఎలా తయారైందంటే.. కొత్తగా పెళ్లైన భార్యభర్తల మాదిరి తయారైంది. రోజూ మాట్లాడుకుంటారు. ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా.. ఫోన్ చేయలేదంటారు. ఇద్దరు భిన్న ధ్రువాలు అయినప్పటికీ.. వారి తీరు ఒక్కటే. ఎవరు ఎవరి మాట వినరు. చాలా మొండిగా ఉంటారు. ఏం చెబుతారో అదే చేస్తారు.
- చాలామంది కొండా మురళీని రౌడీ అంటారు. ఒక ఎస్పీ స్థాయి అధికారి రిటైర్ అయ్యాక.. తనను పిలిపించుకొని.. మీ మార్గమే సరైందన్నారు. ఆయన ఇంటి ముందుఉన్న ఇంట్లో ఒకరు అద్దెకు ఉండి ఖాళీ చేయట్లేదు. పోలీసులు చెప్పినా ఖాళీ చేయలేదు. అలాంటిది కొండా మురళీ వచ్చి రోజులో ఖాళీ చేయాలని చెప్పినంతనే వారు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
- కొండా మురళీ కబ్జాలు చేయరు. కబ్జాలు చేసే వారిని కొడతారు.పేదలకు అండగా నిలుస్తారు.