శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి టీడీపీ నుంచి వైసీపీలోకి జంపా?

Update: 2020-08-08 04:15 GMT
టీడీపీ ఎంత మాత్రం సేఫ్ కాదని ఆ పార్టీలోని తలపండిన వారంతా డిసైడ్ అయ్యారా? టీడీపీ తరుఫున పోటీచేసిన ఓడిపోయిన నేతల్లో అంతర్మథనం మొదలైందా? ఇప్పుడు అందరూ వైసీపీ బాటపట్టడానికి రెడీ అయ్యారా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..

వైఎస్ఆర్ కు ఇష్టమైన ఎమ్మెల్యే ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనంత ఆప్తుడు లేడు.. ఆయనే రాజాంకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి. 2019లో టీడీపీ తరుఫున నిలబడి దారుణంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో టీడీపీలో ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గం తనను ఓడగొట్టిందని ఎన్నికల తర్వాత  టీడీపీ రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు.

జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు కొండ్రు మురళి తమ్ముడే జిల్లా అంతా అప్పుడు చూసుకున్నాడు. వీర కాంగ్రెస్ వాది అయిన మురళి కాంగ్రెస్ ఏపీలో చచ్చిపోయిన తరువాత వైసీపీలో ట్రై చేస్తే సీటు రాలేదు. దీంతో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయాడు.

ఇప్పుడు వైసీపీ నుంచి అతడికి సానుకూల సంకేతాలు వచ్చాయని ప్రచారం సాగుతోంది. జిల్లాలో పెద్దలు కూడా ఒప్పుకున్నారు అని టాక్. వైసీపీలోకి ఆ మాజీ మంత్రి జంప్ అని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News