మరో అన్నదాత పురుగుల మందు తాగాడు

Update: 2019-02-20 11:25 GMT
కారణం ఏదైన కావచ్చు అందరికీ అన్నం పెట్టే మరో అన్నదాత పురుగుల మందు తాగాడు. ఆంధ్రప్రదేశ్‌ లో గుంటూరు జిల్లాలోని కోటయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కోటయ్య స్వగ్రామమైన కొండవీడులో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఈ సంఘటన అక్కడ పెద్ద రాజకీయ దుమారమే రేపింది. కోటయ్యను తీవ్రంగా కొట్టి - భయపెట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్ర‌ధాన‌ ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోటయ్య సాగుచేసుకుంటున్న భూమిని కంట్రోల్‌ రూమ్‌ - మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్‌ కోసం ఇవ్వనందుకే పోలీసులు కోటయ్యను తీవ్రంగా కొట్టారని - పోలీసుల దెబ్బలు తాళలేక కోటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

 అయితే ఈ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు అయిన నారా లోకేష్ ఖండించారు. కోటయ్య సాగుభూమికి గాని కంట్రోల్‌ రూమ్‌ కి గాని అస్సలు సంబంధం లేదని - ముఖ్యమంత్రి కోసం హెలిప్యాడ్‌ వేరో చోట నిర్మింపబడుతోందని ఆయన అన్నారు. అంతేకాదు పోలీసులే కోటయ్యను భుజానికి ఎత్తుకుని ఆఘమేఘాలపై ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు. అంతేకాక దీనికి సంబంధించి రెండు పిక్స్‌ కూడా పోస్ట్ చేసారు. గుంటూరు ఎస్పీ రాజశేఖర్‌ కూడా కానిస్టేబుల్‌ కోటయ్యను భుజానికి ఎత్తుకుని వెడుతున్న వీడియోను రిలీజ్‌ చేసారు.  ఆ వీడియోలో తమ కానిస్టేబుల్ కోటయ్యను భుజానికి ఎత్తుకుని వెడుతుంటే అక్కడ ఉన్న ఒక పౌరుడు ఏం జరిగింది అని అడిగాడని.. అందుకు సమాధానంగా కానిస్టేబుల్ పురుగుల మందు తాగేడు అని సమాధానం ఇచ్చాడని - ఇదంతా కూడా వీడియోలో చూడవచ్చునని ఎస్పీ రాజశేఖర్ అన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మ్రుతుని కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసారు. పోస్ట్‌ మార్టిమ్‌ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొండవీడు గ్రామస్థులకు వాగ్దానం చేసారు.
Tags:    

Similar News