బ్యాంకులు అంటేనే బెంబేలెత్తి పోయేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్న వేళ కోటక్ మహీంద్రా బ్యాంకు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జీరో చార్జ్ - జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందించనున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరలేపింది. అంతేకాకుండా మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తామని, డిజిటల్ లావాదేవీలపై రుసుములు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే ఆధార్ ఆధారిత వన్ టైం పాస్ వర్డ్ ను అందిస్తామని, ఆధార్ - పాన్ కార్డు తీసుకొచ్చి ఏ శాఖ నుంచైనా కేవలం ఐదు నిమిషాల్లోనే ఖాతాను తెరవవచ్చని ప్రకటించింది. ఖాతాల్లోని మొత్తంపై 6శాతం వార్షిక వడ్డీని కూడా అందిస్తామని కూడా సూపర్ ఆఫర్ ఇచ్చారు.
ఇంత మంచి ఆఫర్ వెనుక షాకింగ్ వార్త ఏమైనా ఉంటుందేమో అని సందేహించకండి. కేవలం వాళ్ల వ్యాపార లక్ష్యాలు మాత్రమే ఉన్నాయట. వచ్చే 18 నెలల్లో తమ ఖాతాదారుల సంఖ్యను 1.6 కోట్లకు పెంచాలన్న ఉద్దేశంతోనే జీరో బ్యాలెన్స్ - జీరో చార్జ్ ఖాతాలను ప్రారంభించనున్నట్టు ఆ బ్యాంకు వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. ఈ సరికొత్త పథకం వినియోగదారుల మనసును దోచుకుంటుందని భావిస్తున్నట్లు కోటక్ ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/