అధినేత మనసును దోచుకోవటం కోసం మాట్లాడటం ఇప్పటి నేతలకు మామూలే. మనసులో ఒకమాట నాలుక చివరన మరో మాట మామూలే. పవర్ లేక ప్రతిపక్షంలో ఉండి.. పార్టీ భవిష్యత్తు ఏమిటో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కోటా ఏదైనా తమకు కాసిన్ని పదవులు పడేస్తే చాలన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీతో బండి లాగించాలన్న ఆశ పడుతున్న తమ్ముళ్ల ఆశల మీద టీటీడీపీ నేత కొత్తకోట దయాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తమ్ముళ్లు పెట్టుకున్న ఆశల మీద తన మాటలతో బక్కెట్ల కొద్దీ నీళ్లు పోసేశారు.
ఏపీ కోటాలో వచ్చే రాజ్యసభ పదవి కోసం ఆశించటం తెలివితక్కువ పనిగా అభివర్ణించిన కొత్తకోట.. పదవుల కోసం పాకులాడటం సరైన విధానం కాదని చెప్పుకొచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు ఏ పదవి ఉందని తొమ్మిది నెలలు జనాల్లో తిరిగారంటూ లాజిక్ గా ప్రశ్నిస్తూ.. పదవి ఇస్తేనే పని చేస్తామన్న ధోరణి ఏ మాత్రం సరికాదని చెప్పుకొచ్చారు. పదవి ఇస్తే పార్టీకి పూర్వవైభవం కష్టమన్న ఆయన.. పదవులు ఆశించే వారు ప్రజల్లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని హితవు పలుకుతున్నారు.
తాజాగా రాజ్యసభ రేసులో సీటు కోసం కిందామీదా పడుతున్న తెలంగాణ తమ్ముళ్ల ప్రయత్నాల్ని దెబ్బ తీసేలా కొత్తకోట వ్యాఖ్యలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. తనకు రాని పదవి మరెవరికీ రావొద్దన్నట్లుగా కొత్తకోట చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో కొత్త మంటను రేపుతున్నాయి. తమ అవకాశాల్ని దెబ్బ తీసేలా మాట్లాడుతున్న కొత్తకోటకు.. భవిష్యత్తులోనూ ఎలాంటి పదవి ఇవ్వకున్నా ఫర్లేదా? అంటూ తమ్ముళ్లు ఒకింత కడుపుమంటతో ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలోనూ కాస్తంత ధర్మం ఉన్నట్లు అనిపించట్లేదు?