మూణ్ణాలుగు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గానికి ఎంపీ ఆమె... కాంగ్రెస్ ఉద్ధండుడు - అజాత శత్రువు అయిన కిశోర్ చంద్ర దేవ్ పై ఫస్టు అటెంప్టులోనే గెలిచిన రికార్డు.. అంతేకాదు, గెలిచిన 10 రోజులకే పార్టీ ఫిరాయించడం మరో సంచలనం... ఇన్ని సంచలనాలకు కేంద్రమైన అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఇప్పుడు ఆ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎవరూ గుర్తు పట్టడం లేదట. ఆమె అధికార పార్టీలోకి మారడం వల్ల ఆమెకు కానీ, ఆమె నియోజకవర్గానికి కానీ వచ్చిన ఫలితమేమీ లేదంటున్నారు. భూవ్యవహారాల్లో చిక్కుకున్న ఆమెకు అధికార పార్టీ నుంచి ఏమీ సహాయం అందడం లేదు.. అలాగే... ఆమె నియోజకవర్గానికీ నిదులు కానీ, పనులు కానీ దక్కడం లేదంటున్నారు. తాజాగా ఆమె అరకు ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఒక్కరు కూడా ఆమెను గుర్తుపట్టలేదట. ఆ ఫిరాయింపు ఎంపీకి ఆదరణ అంతలా ఉంది మరి.
గెలిచిన పది రోజులకే పార్టీ ఫిరాయించి వార్తల్లో నిలిచిన గీత నియోజవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని అప్పట్లో చెప్పారు. అయితే ఆమె ఫిరాయించడం వల్ల నియోజకవర్గానికి వచ్చి ఫలితం మాత్రం శూన్యం. ఆ విషయం ఆమె స్వయంగా చెప్పారు. అరకు నియోజకవర్గాన్ని అప్పుడప్పుడు సందర్శించే గీత సోమవారం అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు గానీ, సిబ్బంది గానీ ఆమెను కనీసం గుర్తుపట్టలేదు. దీంతో చివరకు తాను ఎంపీనని పరిచయం చేసుకున్నారామె. అప్పుడు డాక్టర్లు హడావుడి మొదలుపెట్టారు. ఆస్పత్రిని పరిశీలించిన గీత… కనీసం సౌకర్యాలు కూడా లేవని ఆవేదన చెందారు. విష జర్వాలతో వస్తున్న వారికి సాధారణ మందులు - సెలైన్లు ఎక్కించి మేనేజ్ చేస్తున్నారని చెప్పారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోయారు. ఆస్పత్రి పరిస్థితిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పి వెళ్లిపోయారు.
అయితే ఎంపీ అయిన రెండున్నరేళ్లకు అరకు ఆస్పత్రి - ఇక్కడి పరిస్థితులు తెలిశాయా అని సామాన్యులు మండిపడుతున్నారు. అదీ… ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితి. తన నియోజవకర్గంలోనే తాను ఎంపీనని పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చింది. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి ఫిరాయించానని చెప్పిన ఆమె తన నియోజకవర్గాన్ని అంతగా పరుగులు తీయిస్తున్నారని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/