కోట్ల సూర్యప్రకాశరెడ్డి అలిగారు

Update: 2016-02-02 12:40 GMT
సీనియర్ కాంగ్రెస్ నేత - మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆ పార్టీ  ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అనంతపురం పర్యటన సందర్భంగా అవమానం జరిగింది. రాహుల్‌ పాల్గొన్న సభలో వేదికపై సూర్య ప్రకాశ్‌ రెడ్డికి సముచిత గౌరవం కల్పించలేదు. తనకు సముచిత గౌరవం కల్పించకపోవడంతో కోట్ల అలకబూనారు. వేదిక మీదనుంచి దిగి వెళ్లిపోయారు. కాగా కోట్లకు అవమానం జరిగిందన్న విషయం తెలిసిన కర్నూలు కాంగ్రెస్‌ కార్యకర్తలు భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని వివరణ ఇచ్చే వరకూ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌ కార్యాలయానికి తాళం వేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు.

జాతీయ ఉపాధి హామీ పథకం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అనంతపురంలో రాహుల్‌ - మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లు అనంతపురంలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోట్లకు తగిన గౌరవం లభించలేదు. అక్కడ ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని... దీంతోనే ఆయన అలిగి  వచ్చేశారని తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ అసలే అంతంతమాత్రంగా ఉన్నప్పుడు సీనియర్ లీడర్ లలో అసంతృప్తి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే... రాయలసీమ కాంగ్రెస్ లో వర్గ విభేదాల కారణంగానే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు తెలిసే కోట్లకు అవమానం జరిగినట్లు చెబుతున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Tags:    

Similar News