కోట్ల మాట‌!... 2019లో టీడీపీకి ఓట‌మే!

Update: 2017-09-18 10:37 GMT
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక‌ - ఆ త‌ర్వాత కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ కు జ‌రిగిన ఎన్నిక‌... రెండింటిలోనూ వ‌రుస విజ‌యాల‌తో టీడీపీ నేత‌లు - ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆనందాల‌కు అవ‌ధులే లేవ‌న్న రీతిలో వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. ఈ రెండు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని తేలిపోయింద‌ని సంబ‌ర‌ప‌డిపోతున్న టీడీపీ వ‌ర్గాలు... 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే గెలుపు అని, త‌మ విజ‌యాన్ని ఆపే ద‌మ్ము ఏ ఒక్క‌రికీ లేవ‌ని కూడా కాస్తంత ఘాటైన వ్యాఖ్య‌లే చేస్తున్నారు. వ‌రుస‌గా రెండు చోట్ల విజ‌యం ద‌క్కించుకున్న పార్టీలో ఆ మాత్రం విజ‌యానందం సాధార‌ణ‌మే అనుకున్నా... ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ గెలుపు కూడా ఓ గెలుపేనా? ఈ మాత్రానికే ఇంత మేర జ‌బ్బ‌లు చ‌రుచుకోవాలా? అయినా ముందుంది ముస‌ళ్ల పండ‌గ అంటూ వైరి వ‌ర్గాలు వాదిస్తున్నాయి.

క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యంపై కాస్తంత స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌నే ఉన్న టీడీపీ... ఇటు విజ‌య సంబ‌రాలు చేసుకుంటూనే.. మ‌రోవైపు ఇత‌ర పార్టీల్లోని బ‌ల‌మైన నాయ‌కుల‌ను త‌న వైపున‌కు తిప్పుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వహ‌రిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి త్వ‌ర‌లో త‌మ పార్టీలో చేర‌నున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. త‌న అనుకూల మీడియాలోనూ ఈ వార్త హైలెట్ అయ్యేలా టీడీపీ చూసుకుంటోంది. అయితే ఈ వార్త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోట్ల‌... అస‌లు ఏం చూసుకుని తాను టీడీపీలో చేర‌తానో చెప్పాల‌ని టీడీపీ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. తాను పార్టీ మారుతున్న‌ట్లుగా తాను ఎప్పుడూ చెప్ప‌లేద‌ని, అయినా కూడా టీడీపీ నేత‌లు వారికి వారుగా తాను పార్టీ మారుతున్న‌ట్లు దుష్ప్ర‌చారం చేయ‌డం సరికాద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు ఆడుతున్న మైండ్ గేమ్‌ కు తాను ప‌డిపోయే వ్య‌క్తిని కాద‌ని కూడా కోట్ల కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా కోట్ల విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. కోట్ల కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటానని, పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. అయినా టీడీపీ ఏం ఘ‌న‌త సాధించింద‌ని తాను ఆ పార్టీలో చేర‌తాన‌ని ప్ర‌శ్నించిన కోట్ల‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని తేల్చేశారు. అస‌లు 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నేతృత్వంలో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే టీడీపీ ఓట‌మి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని కూడా కోట్ల కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.
Tags:    

Similar News