కోట్ల విజయభాస్కర రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతికొద్ది కీలకమైన నేతల్లో కోట్ల ఒకరు. అందుకే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి కూడా వరించింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇప్పుడు కాకపోయినా ఐదేళ్ల తర్వాతైనా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగు పడుతుందేమోనని కోట్ల ఆశపడ్డారు. కానీ ఏపీలో కాంగ్రెస్ మళ్లీ బతికే అవకాశాలు లేకుండా పోయాయి. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో.. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తన భవిష్యత్ ని నాశనం చేసుకునే బదులు వేరే పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.
కోట్లకు అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి ఆఫర్స్ ఉన్నాయి. అయితే.. ఆయనకు ఏఐసీసీలో ఉన్నపలుకుబడి దృష్ట్యా ఇప్పటివరకు పార్టీ మారే ఆలోచన చేయలేదు. తెలంగాణలో ఎన్నికల కోసం టీడీపీ - కాంగ్రెస్ కలిశాయి కాబట్టి.. ఏపీలో కూడా అదే పొత్తు కంటిన్యూ అవుతుందని కోట్ల అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యేసరికి ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. గురువారం పార్టీ కార్యకర్తలతో స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించారు. మరోవైపు పార్టీ మారొద్దని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఈసారి కోట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. టీడీపీలోకే వెళ్లే అవకాశాలు ఎక్కువుగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే.. జగన్ తో కలిసి పనిచేయడం కోట్లకు మొదటినుంచి ఇష్టం లేదు. అందుకే.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఖామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.