ఒక కుటుంబం ఒక దేశాన్ని ప్రభావితం చేస్తుందా? అంటే..‘గాంధీ’ కుటుంబానికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ప్రజాస్వామ్య భారతంలో గాంధీ కుటుంబం ఎంతటి పవర్ సెంటరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీకి గాంధీ ప్యామిలీకి మించిన ప్రత్యామ్నాయం మరొకటి కనిపించదు. అలాంటి గాంధీ ఫ్యామిలీలో అత్యంత కీలకమైన ఇందిరాగాంధీకి సంబంధించిన చాలా అంశాల్ని ఒక పుస్తకంగా తయారైంది. ఇందిరమ్మకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన కేపీ మాథుర్ తాజాగా ఒక పుస్తకాన్ని రాశారు. అన్ సీన్ ఇందిరాగాంధీ పేరిట ఆయన రాసిన పుస్తకం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సఫర్ద్ జంగ్ ఆసుపత్రిలో మాజీ డాక్టరైన ఆయన.. 20 ఏళ్లు ఇందిరమ్మకు డాక్టర్ గా వ్యవహరించారు. రోజూ ఆమెను కలిసేవారు. ఆమెను అత్యంత దగ్గరగా చూసిన మాథుర్.. ఆమెకు సంబంధించిన అంశాల్ని ఒక పుస్తకంగా రాయటం.. దానికి ముందుమాటను ఇందిరమ్మ మనమరాలు ప్రియాంకగాంధీ రాయటం గమనార్హం. ఈ పుస్తకంలో ఇందిర కోడళ్లు అయిన సోనియా.. మేనక గాంధీలకు సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించటమే కాదు..వీరిద్దరికి సంబంధించి వచ్చే చాలా సందేహాలకు సమాధానాలుగా ఈ పుస్తకం ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పాలి.
ఆయన పుస్తకంలో వెల్లడించిన అంశాల్లో కొన్నింటిని చూస్తే..
= సంజయ్ గాంధీ మరణించిన తర్వాత ఇందిర మేనకగాంధీ వైపే మొగ్గు చూపారు. కానీ.. ఆమె ఇందిరకు దగ్గర కాలేకపోయారు.
= ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పైచేయి. రాజకీయాల వరకూ వచ్చేసరికి మేనక అభిప్రాయాల్ని ఇందిర పట్టించుకునే వారు కాదు.
= రాజకీయ అంశాల్లో మేనకను ఆమె అత్త ఇందిరమ్మ పట్టించుకోకపోవటానికి కారణం ఆమెలో రాజకీయ దృక్కోణం ఉండటమే.
= సంజయ్ గాంధీ మరణించిన రేండేళ్లకే మేనకా గాంధీ ప్రధాని నివాసం నుంచి బయటకు రావటానికి ఓ పెద్ద కారణం ఉంది.
= లక్నోలో నిర్వహించిన సంజయ్ విచార్ మంచ్ సదస్సులో మేనకను మాట్లాడొద్దని ఇందిరమ్మ ఆదేశించారు. అప్పుడామె విదేశాల్లో ఉన్నారు.
= కానీ.. ఇందిరమ్మ మాటను లక్ష్యపెట్టని మేనకాగాంధీ ఆ సదస్సులో మాట్లాడారు. అదో వివాదంగా మారి.. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది.
= ఇందిర.. మేనకల మధ్య ఇలాంటి వైరుధ్యాలు ఉంటే.. సోనియమ్మ విషయంలో అందుకు భిన్నమైన వాతావరణం ఉండేది.
= ఇందిరమ్మకు సోనియా చాలా గౌరవం ఇచ్చేవారు. అదే సోనియా మీద ఇందిరమ్మకు మక్కువ పెరగటానికి కారణంగా మారింది.
= ఇంటి నిర్వహణ బాధ్యతను సోనియా చాలా త్వరగా తీసుకున్నారు. రాజకీయాలకు సంబంధించిన అవగాహన సోనియా కంటే మేనకకే ఎక్కువని భావించేవారు.
= 1974 మే 18న పోఖ్రాన్ అణుపరీక్షలకు సర్వం సిద్ధమైన వేళ ఇందిర తీవ్రమైన ఒత్తిడితో కనిపించారు. అశాంతితో ఉన్నట్లు కనిపించటంతో ఏమైనా ఆరోగ్య సమస్యలా అంటే ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
= మాట్లాడేందుకు ప్రయత్నించినా పెద్దగా ఆసక్తి చూపలేదు. టెలిఫోన్ వంక తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఫోన్ రాగానే ఎత్తినట్లే ఎత్తి పెట్టేశారు. ఆమె పక్కనున్న టేబుల్ మీదున్న తెల్ల కాగితం మీద గాయత్రి మంత్రం సుదీర్ఘంగా రాసి ఉంది.
= ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఇందిర గాబరాగా ఉన్న సందర్భాలున్నా.. కొన్నిసార్లు ధృడ చిత్రతంతో వ్యవహరించే వారు.
= హిందీ వ్యతిరేక ఉద్యమంతో మద్రాస్ యూనివర్సటీ అట్టుడుగుడుతున్న వేళ.. అక్కడికి వెళ్లి హిందీని తక్కువగా చూడొద్దని విద్యార్థులకు చెప్పటమే కాదు.. హిందీని తమిళంతో సమానంగా చూడాలని చెప్పారు. ‘‘మీరు హిందీ నేర్చుకోండి. నేను తమిళం నేర్చుకుంటా’’ అని చెప్పారు.
= సెలవ రోజుల్లో ఇందిర గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల్ని చదివేవారు.
= సైకాలజీ సంబంధించిన అంశాలు.. సైన్స్ మేగజీన్లను ఇష్టపడే వారు. క్రాస్ వర్డ్ పజిల్స్ ను పూరించటం ఆమెకు చాలా ఇష్టం.
= కొన్ని సమయాల్లో లంచ్ అయ్యాక ఇందిరమ్మ పేకాట ఆడేవారు.
= దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత నాటి ప్రధానిగా ఉన్న ఇందిర.. ఆమె కుమారుడు సంజయ్ మీద వ్యతిరేకత దేశ వ్యాప్తంగా గంట గంటకు పెరిగేది. నిజానికి నాటి పరిస్థితుల మీద ఇందిరమ్మ కూడా అసంతృప్తిగా ఉండేవారు. కానీ.. ఎందుకో జోక్యం చేసుకోకుండా ఉండిపోయారు. చిన్నకొడుకు సంజయ్ మీద ప్రేమకు ఇందిరమ్మ బాధితురాలయ్యారు.