మూడు రోజుల క్రితం నిజాంపేట రోడ్డులో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ ను తప్పించుకోవటం కోసం ఫుల్ గా తాగేసిన వాహనదారు ఒకరు అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐను బలంగా ఢీ కొనటం.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు పోలీసు అధికారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స జరపటం తెలిసిందే.ఈ ఘటనలోతీవ్రంగా గాయపడిన సదరు పోలీసు అధికారి మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రిలో కన్నుమూసిన విషాద ఉదంతం చోటు చేసుకుంది.
నిజాంపేటలో శనివారం రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్ కేపీహెచ్ బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డిని బలంగా ఢీ కొట్టారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలైన ఏఎస్ఐను ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా.. గాయాలు తీవ్రంగా కావటంతో ఆసుపత్రిలో మరణించారు. ఇంటిపెద్ద మరణవార్తను విన్న ఏఎస్ఐ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సమాచారం తెలిసిన వారంతా వేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతతో విధులు నిర్వహిస్తున్న అధికారిని.. బాధ్యత లేని ఒకరి కారణంగా ప్రాణాలు పోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.