ఐటీ రంగంలోని ఉద్యోగులు మరో చేదువార్త వినాల్సి వచ్చింది. సదరు చేదు వార్త కూడా పరిశ్రమ విషయంలో స్పష్టమైన అవగాహన కలిగిన ప్రముఖుడి ద్వారా కావడం ఆసక్తికరం. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ దేశీయ ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లు తగ్గాయని విశ్లేషించారు. అయితే, ఇండస్ట్రీ వృద్ధి మందగించిన సమయంలో ఇలాంటి పరిణామాలు సాధారణమేనని ఆయన పేర్కొన్నారు.
ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయన్న వార్తల్లో మాత్రం నిజం లేదని క్రిస్ అన్నారు. ఐటీ రంగంలో సవాళ్లు పెరిగిన నేపథ్యంలో వృద్ధి మందగించిందని, దాంతో ఇండస్ట్రీలో ఉద్యోగుల అవసరం తగ్గుతున్నదన్న క్రిస్.. అలాంటప్పుడు ప్రమోషన్లు కూడా తగ్గుతాయన్నారు. అలాగే, ఐటీ ఉద్యోగుల పనితీరు మదింపు ప్రక్రియ సైతం మరింత కఠినతరం కానుందని ఈఅన్నారు. ఐటీ రంగంలో యువ ఉద్యోగుల తొలగింపులను నివారించాలంటే సంస్థల సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు తమ జీతాలు తగ్గించుకోవాలని ఈమధ్య ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణమూర్తి ఇండస్ట్రీకి ఉద్భోద చేశారు. ఈ క్రమంలోనే క్రిస్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇదిలాఉండగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగాల కల్పన మందగించిందని ప్రముఖ వాణిజ్య మండలి అయిన అసోచామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2013నాటికి ఈ రంగంలో 33 లక్షల మంది పనిస్తుండగా.. 2020నాటికి మరో 22 లక్షల మంది అవసరం ఉంది. కానీ గడిచిన 3-4 ఏళ్లలో ఐటీ సెక్టార్ కేవలం పది లక్షల మందికే ఉద్యోగావకాశాలు కల్పించగలిగిందని అసోచామ్ రిపోర్టు తెలిపింది. ఏటా దేశంలో కనీసం 1.5-2 కోట్ల ఉద్యోగావకాశాలు అవసరం. ఈ నేపథ్యంలో దేశీయంగా, ఎగుమతుల మార్కెట్‌లోనూ వృద్ధి చెందే అవకాశాలున్న ఇతర రంగాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/