మీరు రోజుకు వంద గ్రాముల అన్నం మాత్రమే తినాలన్నది రూల్ అనుకుందాం. అందుకు భిన్నంగా 100.5 గ్రాముల అన్నం తిన్నారని వేలెత్తి చూపిస్తే ఎలా ఉంటుంది? సాంకేతికంగా చూస్తే.. తినాల్సిన వంద గ్రాముల కంటే ఎక్కువగా తిన్నట్లు కనిపించినా? ఆ తిన్నది మరో వంద గ్రాములా? యాభై గ్రాములా? అన్నది ప్రశ్న. అదేమీ కాకుండా అరగ్రాము ఎక్కువ తినటాన్ని వేలెత్తి చూపించటాన్ని ఏమనాలి? ఎలా తీసుకోవాలి? తాజాగా కృష్ణా బోర్డు తీరు కూడా ఇదే రీతిలో ఉందని చెప్పాలి.
శ్రీశైలం.. నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునే విషయంలో.. తనకు కేటాయించిన దాని కంటే ఏపీ ప్రభుత్వం ఎక్కువ వాటాను వాడేసిందన్న మాటను అనేయటంలో అర్థముందా? అన్నది ప్రశ్న. కొలతకట్టి తీసుకోవాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యలో.. మరే కారణంతోనే స్వల్ప మోతాదులో నీటిని వాడినందుకే అంతలా రచ్చ చేయాలన్నది ప్రశ్నగా మారింది.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాటు ఎత్తిపోతల పథకం ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల వారు ఎవరికి వారుగా లేఖలు రాసుకునే పరిస్థితి. దీనికి తగ్గట్లే.. కేంద్రానికి చెందిన బోర్డులు.. ఇరిగేషన్ మంత్రిత్వ శాఖలు స్పందిస్తున్న తీరు చూస్తే.. నవ్వు రాక మానదు. తాజా ఉదంతాన్ని తీసుకుంటే.. నాగార్జున సాగర్.. శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా ఏప్రిల్ 20న కేటాయింపులు డిసైడ్ చేశారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ 647.28 టీఎంసీలు నీటిని వాడాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఇప్పటికి ఆ రాష్ట్రం 647.55 టీఎంసీలు నీటిని వాడుకుంది. అంటే.. 0.27 టీఎంసీల నీరు అధికంగా వాడుకుంది.
అంతమాత్రానికే కోటాకు మించి నీటిని వాడేశారన్న ముద్ర వేయటంతో పాటు.. నీటి విడుదలను ఆపేయాలని అంత హడావుడి లేఖ రాయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఇప్పుడు నడుస్తున్నది వేసవి కాలం. నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివేళ.. కేటాయింపుల కంటే కాస్త ఎక్కువ వాడుకోవటాన్ని మానవత్వంతో అర్థం చేసుకోవాలి. లేదంటే.. వాటాకు మించి నీటి వాడకం ఉన్నట్లు గుర్తించినప్పుడు ఆ విషయాన్ని సున్నితంగా చెప్పాలి. అందుకు భిన్నంగా ఏదో పె..ద్ద తప్పు చేసినట్లుగా వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న మాట బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం నిర్మించిన ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసిన ఏపీకి.. కృష్ణా బోర్డు ఊహించని రీతిలో స్పందించి షాకిచ్చిందని చెప్పాలి. మరి.. కొద్దిపాటి నీటి వాడకానికే ఇంత హడావుడి చేయాలా? అన్నది క్వశ్చన్ గా మారింది.