మరో ‘జన జాతర’కు మహుర్తం డిసైడ్ అయ్యింది. పన్నెండేళ్లకు ఓసారి వచ్చే కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏపీ సర్కారు ముహుర్తం డిసైడ్ చేసింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు పుష్కరాల్ని నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ ముహుర్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతి ముహుర్తం పెట్టారు.
పుష్కరాలకు సంబంధించిన ముహుర్తం ఎలా నిర్ణయించారన్న విషయానికి వస్తే.. దేవ గురువు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించిన శుభ తరుణంలో కృష్ణా నదికి పుష్కరాలు మొదలవుతాయి. ఆగస్టు 11 రాత్రి 9.22 గంటలకు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే.. అప్పటికి సూర్యస్తమయం అయిపోతుంది. దీంతో.. శ్రావణ శుక్ల నవమి.. శుక్రవారం ఆగస్టు 12 తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు సాగే పుష్కరాలు ఆగస్టు 22 సాయంత్రంతో ముగియనున్నాయి.