తెలంగాణ మంత్రి కేటీఆర్ గురించి ఆయన సోదరి - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్ నాకే కాదు, తెలంగాణ ఆడ బిడ్డలందరికీ సోదరుడు అని తన సోదరుడు కేటీఆర్ ను కొనియాడారు. రామన్న మన అందరికి అన్న అని విశ్లేషించారు. ఇవాళ ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కల్వకుంట్ల కవిత - డీఎస్ - స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు - కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్న మన అందరి కష్టాలను తీర్చుతారని అన్నారు. తనకు ఆత్మీయ సోదరుడు ఉన్నందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. మున్సిపాలిటీల అభివృద్దికి అన్న కేటీఆర్ రూ.350 కోట్లు ఇవ్వాలని కోరారు. ఇవాళ ఆర్మూర్ లో జరిగిన జనహిత ప్రగతి సభలో ఆమె మాట్లాడారు. దక్షిణ భారత దేశానికే వ్యవసాయం నేర్పిన ఆదర్శవంతమైన జిల్లా నిజామాబాద్ అని తెలిపారు. వైవిద్యమైన పంటలు - ఆదర్శవంతమైన రైతులున్న జిల్లా నిజామాబాద్ అని కొనియాడారు. ఉద్యమంలో కూడా నిజాబాబాద్ జిల్లా అగ్రభాగాన నిలిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ నిలిచిందని కవిత అన్నారు. ఇక పచ్చ పార్టీ టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తప్పా కొత్తగా ఏర్పడిన రాష్ర్టాల్లో రాజకీయ సుస్థిరత లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడేకంటే ముందు మూడు కొత్త రాష్ర్టాలు ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని అన్నారు. గతంలో కంటే ఈసారి టీఆర్ ఎస్ సభ్యత్వం ఎక్కువగా నమోదైందని తెలిపారు. గతంలో 51 లక్షలు ఉంటే ఈసారి 71 లక్షలు సభ్యత్వం నమోదయిందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ టీఆర్ ఎస్ పార్టీ ఒక్కటే నని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, నక్సలైట్ల రాజ్యమవుతుందని ఆంధ్రా పాలకులు చేసిన దుష్ప్రచారాన్ని సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారని అన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో అద్బుతంగా మాట్లాడే ఐదుగురిలో ఎంపీ కవిత ఒకరని కేంద్రమంత్రి ఒకరు కితాబిచ్చారని అన్నారు. `మీ తండ్రి మీకు మంచి తర్ఫీదునిచ్చారని ఆయన అన్నారు. అయితే మాకు శిక్షణ ఇచ్చింది మా తండ్రి కేసీఆర్ కాదు, తెలంగాణ ఉద్యమం` అని పేర్కొన్నారు. ఉద్యమమే తమకు అన్ని నేర్పిందన్నారు. తన చెల్లెలు కవితపై కేటీఆర్ ఛలోక్తులు విసిరారు. తాను చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి ఇవ్వాళ ఎంపీగారు అని పిలవాలని అనిపించడం లేదన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి. అన్నా చెళ్లెల్లు ఒకే వేదికను పంచుకోవడం సభికులకు కనువిందు చేసింది.
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాటి సీఎం కిరణకుమార్‌రెడ్డి చేసిన దుష్ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు రాదని, తెలంగాణ రైతులు అదోగతి పాలవుతారని, తెలంగాణ నక్సలైట్ల రాజ్యమవుతుందని కిరన్‌కుమార్‌రెడ్డి అన్నారని విమర్శించారు. కానీ ఇవాళ వాళ్లందరి నోళ్లు మూయించి కరెంటు కష్టాలన్ని దాటుకుని తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ పడ్డన్ని తిట్లు ఎవరూ పడలేదని గుర్తు చేశారు. నవ్విన నాపచేనే పండినట్టు తెలంగాణను అద్బుతంగా తీర్చి దిద్దుకున్నామన్నారు.
సీఎం కేసీఆర్ ఎవరూ అడగకపోయినా, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని తెలిపారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మహిళలు గర్బిణులయితే వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. డెలివరీ అయ్యే వరకు అమ్మ ఒడి పేరుతో మొత్తం రూ.12 వేలు అందేలా ఏర్పాటు చేశామన్నారు. మొదటి మూడు నెలలు తల్లి, బిడ్డలకు ఉపయోగపడే 13 వస్తువులు పెట్టి కేసీఆర్ కిట్ పేరుతో అందజేస్తున్నామన్నారు. టీడీపీ - కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్లతో ఉప్పు పప్పుకూడా రాలేదన్నారు. పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికే వెయ్యి రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. గతంలో 29 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం రూ.5,300 కోట్ల వ్యయం చేస్తూ 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షీ టీమ్స్ భరోసాను చూసి యూపీ సీఎం ఆదిత్యనాథ్ యాంటీ రోమియో స్వాడ్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు. 55 నుంచి 60 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌పార్టీ చేసిందేమీలేదన్నారు. ఇక పచ్చ పార్టీ టీడీపీ అయితే తెలంగాణలో పత్తాలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/