కేటీఆర్ .. కల్వకుంట్ల తారక రామారావు. కేసీఆర్ తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, రాష్ట్ర మరియు దేశ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ పొలిటిషన్. ప్రస్తుతం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటుగా మంత్రిగా కూడా మరో వైపు బాధ్యతలని నిర్వర్తిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉండే రాజకీయనేతలలో కేటీఆర్ కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ఈ సమస్యనైనా కూడా క్షణాల వ్యవధి లో పరిష్కారం చూపే దమ్మున్న నేత. ప్రజలకి నిత్యం ఎదో ఒక విదంగా ఆసరాగా నిలబడుతూనే ఉంటాడు. అలాగే ఈయనకి యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇకపోతే, తాజాగా మంత్రి కేటీఆర్ ఒక అభిమాని పై ఫుల్ సీరియస్ అయ్యారు. ఇలాంటివి నాకు నచ్చవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏమైంది అంటే ..trsv విభాగానికి చెందిన కార్యకర్త రవికిరణ్ అనే యువకుడు వైపు పై కేటీఆర్ ఫోటో ..దానిపై డైనమిక్ లీడర్ .. ఫోటో కింద జై రామన్న అనే అక్షరాలని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఆ తరువాత ఆ అభిమాని , ఆ ట్యాటూ ని tiwtter లో కేటీఆర్ కి ట్యాగ్ చేసాడు. ట్విట్టర్ లో ఆ ఫోటో చుసిన కేటీఆర్ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఇది నిజమేనా ..? సారీ తమ్ముడూ ఇలాంటి వాటిని నేను అంగీకరించను , సపోర్ట్ చేయను , ఇది ఆరోగ్యానికి హానికరం ..బాధపెట్టే విషయం అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే , మరికొంతమంది అభిమానులు మాత్రం జై రామన్న అంటూ ట్విట్టర్ లో ఆ పోస్ట్ రీ పోస్ట్ చేస్తూ ...ఆనంద పడుతున్నారు.