సూటి ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఆన్స‌ర్ విన్నారా?

Update: 2018-09-15 11:30 GMT
సుత్తి లేకుండా సూటిగా వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌టం కాస్త ఇబ్బందే. కానీ.. తాజా మాజీ మంత్రి కేటీఆర్ కు అలాంటి స‌వాళ్ల‌ను చాలా సింఫుల్ గా తేల్చేస్తుంటారు కేటీఆర్‌. ఎన్నిక‌ల‌కు వెళ్లిన వేళ‌.. ప్రస్తుతం ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకొని ఎన్నిక‌ల‌కు వెళుతున్న ఆయ‌న‌.. ఎంపిక చేసుకున్న కొన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొన్న‌నే ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

చ‌ప్ప చ‌ప్ప‌గా సాగిన ఆ ఇంట‌ర్వ్యూతో పోలిస్తే.. తాజాగా మ‌రో మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్ర‌శ్న‌లు సూటిగా ఉన్నాయి. వాటికి స‌మాధానం చెప్పే విష‌యంలో కేటీఆర్ త‌న‌దైన చ‌మ‌త్కారాన్ని ప్ర‌ద‌ర్శించారు. త‌ప్పు ఒప్పుకున్న‌ట్లే ఒప్పుకుంటూ.. ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌శ్న‌ల‌తోనే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మైన కొన్ని ప్ర‌శ్న‌లు.. వాటికి కేటీఆర్ ఇచ్చిన స‌మాధానాల్ని చూస్తే..

ప్ర‌శ్న‌: బీ-ఫారం ఇచ్చే వరకు ఇవే పేర్లు ఉంటాయా?
కేటీఆర్‌: ఇది పార్టీ అధ్యక్షుడు జవాబు చెప్పాల్సిన మాట.

ప్ర‌శ్న‌: కేటీఆర్‌ను సీఎం చేసేందుకే ముందస్తా?
కేటీర్: నాకు మంత్రి పదవి కూడా వద్దంటున్నా.

ప్ర‌శ్న‌: కేటీఆర్‌ క్లాస్‌ లీడర్‌ మాత్రమేనా?
కేటీఆర్‌: ఓ వ్యక్తి ఎలా మారతాడో పరిస్థితిని బట్టి ఉంటుంది.

ప్ర‌శ్న‌: విపక్ష నేతలపై కేసులు తిరగదోడుతున్నారా?
కేటీఆర్‌: అలా చేయాలనుకుంటే ఇంతకుముందే చేసేవాళ్లం.

ప్ర‌శ్న‌: మీ చుట్టూ కోటరీ ఉందంటున్నారు?
కేటీఆర్‌: ఆ కోటరీ ఏమిటో కొండా సురేఖకే తెలియాలి.

ప్ర‌శ్న‌: కేసీఆర్‌ కొండగట్టుకు వెళ్లలేదేం?
కేటీఆర్‌: ఆయ‌న‌ వైరల్‌ జ్వరంతో ఉన్నారు.

ప్ర‌శ్న‌: రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటున్నారు?
కేటీఆర్‌: అప్పుకాదది; పెట్టుబడి

ప్ర‌శ్న‌: ఫెడరల్‌ ఫ్రెంట్‌ లక్ష్యం నెరవేరుతుందా?
కేటీఆర్‌: అమరావతిలోనే కాదు.. హైదరాబాద్‌లోనూ చక్రం తిప్పొచ్చు.

ప్ర‌శ్న‌: మహా కూటమిని ఎలా ఎదుర్కొంటారు?
కేటీఆర్‌: టీ ప్రాజెక్టులపై చంద్రబాబు రాసిన లేఖల సంగతేంటి.

ప్ర‌శ్న‌: మీ కుటుంబంపై ఆరోపణలొస్తున్నాయ్‌?
కేటీఆర్‌: 13 ఏళ్ల నా కుమారుడినీ విమర్శిస్తున్నారు.

ప్ర‌శ్న‌: గ్రేటర్‌ ప్రజలు అసంతృప్తిగా లేరా?
కేటీఆర్‌: ఒక్క రోడ్ల విషయంలో అసంతృప్తి నిజమే.

Tags:    

Similar News