వాదనల కు ఒక పరిమితి ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా.. మనసుకు తోచిన రీతి లో మాట్లాడటం బాగానే ఉన్నా.. దాని కారణం గా చోటు చేసుకునే విపరిణామాలు సమాజం లో కొత్త అలజడి కి కారణమవుతాయి. తెలివిగా వాదనలు వినిపిస్తూ.. ఒకరి తో మరొకరు కలవలేని రీతి లో విభజన సిద్ధాంతాన్ని వినిపించటం ఈ మధ్యన ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్ర సాధన పేరు తో ఏపీ..తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన సవాలచ్చ అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి రాష్ట్ర విభజన టార్గెట్ పూర్తి చేసిన కేసీఆర్ కుటుంబం.. గడిచిన ఏడున్నరేళ్ల లో ఏం చేసిందో అందరికి తెలిసిందే. ఉద్యమం లో పని చేసిన వారు అధికారానికి దూరంగా ఉండటం.. ఉద్యమానికి దూరం గా ఉన్న వారు అధికారానికి దగ్గర కావటం తెలిసిందే.
తెలంగాణ ఉద్యమ సమయం లో సంధించిన కొన్ని వాదనల్ని.. తాజాగా కేంద్రం లోని మోడీ సర్కారును టార్గెట్ చేసేందుకు తమ అమ్ముల పొది నుంచి బయటకు తీసి అస్త్రాలుగా సంధిస్తున్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ లోని పలువురు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా? అన్న మాట వినిపిస్తోంది. రాజకీయం గా విభేదాలు ఉండొచ్చు.. ప్రజల్లో పలుకు బడి తగ్గుతుందన్న సందేహం వచ్చినంతనే.. విభజన సిద్ధాంతాన్ని వినిపించే కల్వకుంట్ల కుటుంబం.. తాజాగా కేంద్రాన్ని టార్గెట్ చేయటం షురూ చేసింది.
కేంద్రానికి చెల్లించే ప్రతి పైసా తిరిగి రాష్ట్రానికే రావాలని తాము కోరుకోవటం లేదనే కేటీఆర్.. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల్లో కనీసం సగం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వటం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇంతలా విల విలలాడే కేటీఆర్ కు సూటి ప్రశ్న ఏమంటే.. తెలంగాణ రాష్ట్రం లో వసూలయ్యే ఆదాయంలో అత్యధిక భాగంగా హైదరాబాద్ మహా నగరం నుంచే వస్తోంది. మరి.. ఆ ఆదాయంలో సగమైనా హైదరాబాద్ మహా నగరం కోసం తిరిగి ఖర్చు చేస్తున్నారా?
మరింత లోతుల్లోకి వెళితే.. పన్ను ఆదాయాన్ని అందించే వారి సంక్షేమం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించే పన్ను మొత్తంలో ఎంతభాగాన్ని ఖర్చు చేస్తోంది? సంపన్నులు తాము చెల్లించే పన్నుల్లో కనీసం సగం తమకే ఖర్చు చేయాలన్న కేటీఆర్ సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొస్తే ఆయన ఒప్పుకుంటారా? ఒక దేశం లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో లాంటి పరిస్థితులు ఉంటాయి. దేశ సరిహద్దు ల్లోని ప్రాంతాలు మహానగరాలకు దూరంగా ఉంటాయి. ఆదాయాన్ని ఆర్జించలేని స్థితిలో ఉంటాయి. అలా అని.. దేశ రక్షణకు కీలకమైన సరిహద్దుల వద్ద పెట్టే ఖర్చును భూతద్దం లో చూస్తూ.. పన్ను ఆదాయాన్ని ఎక్కువ గా జనరేట్ చేసే రాష్ట్రాలు తమకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకుంటే ఎలా ఉంటుంది?
తాజాగా జరిగిన ఒక కార్యక్రమం లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను పునస్స మీక్షించి, వాటిని నెరవేర్చాలంటూ చిలక పలుకులు పలికారు. కేంద్రాన్ని ప్రశ్నించటానికి ముందు ఏపీ కి చెల్లించాల్సిన మొత్తాన్ని ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఎందుకు చెల్లించటం లేదు? ఏపీ ప్రయోజనాల గురించి గొంతు విప్పిన కేటీఆర్.. విభజన వేళ లో ఏపీకి తెలంగాణకు వాటాల పంపిణీ విషయం లో హేతుబద్ధత లోపించిన విషయాల మీద ఇదే గొంతుకతో మాట్లాడతారా?
తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణం గా మాట్లాడుతున్న కేటీఆర్.. కొన్ని ప్రస్తావించకూడని అంశాల్ని ప్రస్తావించటం ఏ మాత్రం మంచిది కాదు. దేశ జనాభా లో తెలంగాణ వాటా2.5 శాతమే అయినా దేశ జీడీపీకి 5 శాతం సమకూరుస్తుందని.. భౌగోళికంగా 12వ అతి పెద్ద రాష్ట్రమైన మా కంటే పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్.. మహారాష్ట్ర.. తమిళనాడు తర్వాత దేశ జీడీపీ సమకూర్చటంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. తమకు కేంద్రం శూన్య హస్తాన్ని చూపుతుందనే మాట కేటీఆర్ నోట తరచూ వినిపిస్తోంది. హక్కుల కోసం గళం విప్పటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. ఆ పేరుతో దేశ ప్రజల విభజన పెరిగేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న మాటను కేటీఆర్ మర్చిపోకూడదు. వేలెత్తి చూపించే వేళ.. మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే ప్రశ్నిస్తుంటాయన్న చిన్న విషయాన్ని ఆయనమర్చిపోవటం సబబు కాదు. విభజన బీజాలు విషంగా మారటమే కాదు.. దేశ ప్రజల మధ్య సమైక్య భావాల్ని దెబ్బ తీస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.