ఏ కొడుకుకైనా తండ్రి అంటే ప్రాణం. మై హీరో ఈజ్ మై డాడ్ అని యువకులు పేర్కొంటారు. దానికి తగ్గట్టు తమ తండ్రిపై అభిమానం చూపిస్తుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. పరిపాలనలోనూ.. రాజకీయాల్లోను తండ్రికి సమానంగా ఎదుగుతున్నాడు. తండ్రికి కానుకగా తెలంగాణలో జీహెచ్ ఎంసీ - లోక్ సభ - పంచాయతీ - స్థానిక సంస్థల్లో పార్టీని అద్భుత మెజార్టీతో గెలిపించాడు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సొంతం చేసుకుని ఆ తండ్రికి కానుకగా ఇచ్చిన కేటీఆర్ ఇప్పుడు మరో కానుక ఇవ్వాలని ఈసారి ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన తండ్రి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని టీఆర్ ఎస్ పార్టీ నాయకులు - సభ్యులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదంతో మొక్కలు నాటుదామని కోరారు. ఈ నెల 17న కేసీఆర్ 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘హరిత హరం’ పట్ల ఆయనకున్న (కేసీఆర్) అభిరుచి మనందరికీ తెలుసు.. టీఆర్ ఎస్ నాయకులు - సభ్యులు కనీసం ఒక మొక్కను నాటడం ద్వారా మా నాయకుడి పుట్టినరోజును జరుపుకుందాం.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
మరో వ్యక్తి ఇదే తరహా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. హరిత తెలంగాణను కానుకగా ఇద్దామని రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోశ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ర్టాన్ని మనకు అందించిన సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా హరిత తెలంగాణను కానుకగా ఇద్దామని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున విరివిగా మొక్కలు నాటుదామని ఆయన ట్విట్టర్ లో కోరారు.