కూతురు స్కూల్ బాగుందంటున్న కేటీఆర్

Update: 2017-01-07 12:08 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు,  మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స‌మావేశాలు తాత్కాలికంగా వాయిదా ప‌డిన నేప‌థ్యంలో నూత‌న గెట‌ప్ లోకి మారిపోయారు. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే ఐటీ మినిస్టర్ కేటీఆర్ తన కూతురి పేరెంట్ టీచర్ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. ఎనిమిదేళ్ల వ‌య‌స్సున్న‌ కూతురు అలేఖ్య ప్రొగ్రెస్ రిపోర్టును చూసి మురిసిపోయారు. అంతేకాకుండా ట్విట్ట‌ర్‌లో కూడా త‌న సంతోషాన్ని పంచుకున్నారు. తాను ఊహించిన దాని కంటే తన కూతురు మెరుగ్గా చదువుతోందన్నారు.

స్కూలుకు వెళ్లిన సంద‌ర్భంగా కేటీఆర్ సాధారణ వ్యక్తిగా టీచర్లతో సంభాషించారు. కూతురి ప్రొగ్రెస్ రిపోర్టును మంత్రి తిరగేశారు. అలేఖ్య స్టడీస్ గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అలేఖ్య చదువు గురించి మంత్రికి టీచర్లు వివరించారు. తన కూతురిపై ఉన్న ఆప్యాయతను కేటీఆర్ ట్వీట్‌ ద్వారా పంచుకుంటూ అసెంబ్లీ స‌మావేశాలు, రొటీన్ రాజ‌కీయ స‌మావేశాల కంటే పేరెంట్-టీచర్ మీటింగ్‌ కు వెళ్లినందుకు చాలా ఉత్సాహంగా అనిపించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News