తెలంగాణ మంత్రి కేటీఆర్ పట్టుబట్టి మరీ హైదరాబాద్ కు ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటా సెంటర్ ను తీసుకొచ్చారు. హైదరాబాద్ ను డేటా సెంటర్ గా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ ప్రకటనతో హైదరాబాద్ పేరు మరోసారి మారుమోగింది.
గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్ లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. రూ.15వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ పెట్టనుంది.
మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు కోసం హైదరాబాద్ తోపాటు ఇతర నగరాలను పరిశీలించింది. కానీ కేటీఆర్ పట్టుబట్టి హైదరాబాద్ లో డేటా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీని అంగీకరించేలా చేశారు.
మైక్రోసాఫ్ట్ నిర్ణయాలు అంత తేలికగా జరగవు. పక్కాగా పూర్తయిన తర్వాత అంగీకరిస్తారు.భూమి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూమి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భూమిని మైక్రోసాఫ్ట్ కంపెనీకి చూపించింది. ఆ భూమి ప్రభుత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిన సౌకర్యాల పట్ల మైక్రోసాఫ్ట్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాతే ఒప్పందం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలు పోటీపడినా కూడా కేటీఆర్ చొరవతో హైదరాబాద్ కే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దక్కింది.
ఇప్పటికే హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ డెవలప్ సెంటర్ పెట్టిన తర్వాత అక్కడా ఐటీ భూమ్ మొదలైంది. సాఫ్ట్ వేర్ సిటీగా మారింది. ఇప్పుడు ఇదే తరహాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ తో ఆ ప్రాంతమంతా ఐటీ రంగంలో మరింత విస్తృతి కలుగనుంది.
ఇక మైక్రోసాఫ్ట్ నే కాదు.. తెలంగాణలో డేటా సెంటర్ పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూప్ నిర్ణయించింది. హైదరాబాద్ లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ రాకతో మరిన్ని కంపెనీల చూపు హైదరాబాద్ పై పడింది.