అమెరికాలో కేటీఆర్ ఎంత బిజీ అంటే..

Update: 2016-10-13 09:55 GMT
తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి అయిన కేటీఆర్ బిజీబిజీ షెడ్యూల్ తో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించటంతో పాటు.. తెలంగాణ ఇమేజ్ ను మరింత పెంచటం.. పలు పరిశ్రమల్ని తెలంగాణకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాకు వెళ్లిన ఆయన.. అమెరికాలో అడుగు పెట్టిన క్షణం నుంచి వరుస సమావేశాలతో.. భేటీలతో బిజీ బిజీగా ఉండటం గమనార్హం.

తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాల్ని వివరించటంతో పాటు.. పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక పాలసీ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ఆయన.. తెలంగాణకు పెట్టుబడులు తీచ్చేందుకు అవకాశం ఉన్న పలు రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

వివిధ సంస్థల అధిపతులతో.. వారి ప్రతినిధులతో భేటీ అయి.. కీలక చర్చలు జరపటం గమనార్హం. ఓపక్క పారిశ్రామికవేత్తలతో పాటు..  రాయబారులతో.. పర్యావరణ వేత్తలతో భేటీ అయ్యారు. వీటికి తోడు పలు సదస్సులకు వెళ్లిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచేందుకు ఉన్నఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టటం లేదు. హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీలను ఔటర్ రింగు రోడ్డు అవతలకు మార్చాలన్న అంశంపై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లే పర్యావరణ నిపుణులతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు పలు ప్రముఖ కంపెనీలతో కేటీఆర్ భేటీ అయి.. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించే ప్రయత్నం చేశారు. రోజు వ్యవధిలో కేటీఆర్ పాల్గొన్న భేటీలు చూస్తే.. చర్చలు జరిపిన ప్రముఖల వివరాలు చూస్తే..

= భారత రాయబారి తరుణ్ జీత్ సింగ్‌

= అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరీన్‌ బి. హడ్డా

= బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్‌ మార్క్‌ అలెన్‌

= క్లీవ్ లాండ్ మెటార్ సైకిల్ వర్క్ కంపెనీ సీఈవో జోనాథన్‌

= కమ్యూనిక్లిక్ సంస్ధ ప్రతినిధి రాంరెడ్డి

= ప్రముఖ ఫార్మా కంపెనీలైన పైజర్ - ఏలీ లీలీ - అలెక్సియన్ మెర్క్ - అమ్జెన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ

= యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి సదస్సులో పాల్గొన్నారు

 
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News