మరోసారి ట్వీట్ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. గతంలోనూ ఇదే తరహాలో ఉత్తమ్‌కు సవాల్ విసిరిన కేటీఆర్ ఈసారి మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ మరోసారి విజయం సాధించకుంటే తాను రాజకీయ సన్యాసానికి సిద్దమన్నారు కేటీఆర్. తన సవాల్ కు ఉత్తమ్ స్పందించాలన్నారు. తాజాగా ఇదే సవాల్ కు మరో పాయింట్ యాడ్ చేశారు.
గతంలో తాను ప్రకటించినట్లు రాజకీయ సన్యాసం మాట మీదనే ఉంటానని.. ఉత్తమ్ తన సవాల్ కు స్పందించినా లేకున్నా అని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యన తెలంగాణ భవన్ లో కొందరు పార్టీలో చేరుతున్న వేళ.. ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపటం తెలిసిందే.
అమ్మా కాదు.. బొమ్మా కాదంటూ సోనియా మీద కేటీఆర్ నోరు పారేసుకున్న తీరును పలువురు కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉత్తమ్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. సోనియాగాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఉత్తమ్ ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ తప్పు పట్టారు.
2014లో తప్పనిసరి పరిస్థితుల్లో జనం కొడతారన్న భయంతోనే సోనియా తెలంగాణ ఇచ్చారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య సరికావన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు.. మంత్రి కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సోనియాపై తాను నోరుపారేసుకున్న తీరుపై వెల్లువెత్తిన విమర్శల్ని కేటీఆర్ లైట్ తీసుకోవటమే కాదు.. ఆ విషయంపై రియాక్ట్ కాకుండా.. పాత సవాల్ ను కొత్తగా ప్రస్తావించటం చూస్తే.. ఇష్యూను డైవర్ట్ చేస్తున్నట్లు కనిపించట్లేదు?