న్యూఇయర్ గిఫ్ట్ ఏందో ముందే చెప్పిన కేటీఆర్

Update: 2017-03-23 04:21 GMT
హైదరాబాద్ మహా నగర ప్రజలకు వచ్చే న్యూఇయర్ గిఫ్ట్ ఏందో దాదాపు ఏడు నెలల ముందే చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఎంతో కాలంగా ఎప్పుడా.. మరెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైల్ ఎప్పుడు పరుగులు తీయనుందన్న విషయన్నితాజాగా వెల్లడించారు. ఇప్పటివరకూ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్రో రైలు పరుగులు తీస్తుందని భావించారు.

కానీ.. అందులో వాస్తవం లేదన్న విషయం తాజాగా కేటీఆర్ చేసిన ప్రకటనతో తేలిపోయింది. ఇప్పటివరకూ వచ్చిన వార్తల ప్రకారం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ.. మొదటి విడతగా మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్ వరకూ మెట్రో రైలు నడుపనున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే.. ఇందులో వాస్తవం లేదన్న విషయం తాజాగా కేటీఆర్ చెప్పిన మాటల్నివింటే ఇట్టే అర్థమవుతుంది.

మొదటి విడతగా రద్దీ ఎక్కువగా ఉండే మియాపూర్ నుంచి ఎల్ బీనగర్ వరకున్న 29 కిలోమీటర్లు.. నాగోల్ నుంచిహైటెక్ సిటీ వరకున్న 27 కిలోమీటర్లు మెట్రో పరుగులు తీస్తుందన్న విషయాన్నివెల్లడించారు. ఇందుకు డిసెంబరు నాటికి ముహుర్తంగా నిర్ణయించారు. ఈ డిసెంబరు నాటికి మెట్రో రైలును అందుబాటులోకి తేనున్నట్లుగా ప్రకటించారు.

కేటీఆర్ చెప్పిన తాజామాటల్ని చూస్తే.. ఈ ఏడాది చివరి నాటికిమెట్రో పరుగులు తీస్తే.. అది కచ్ఛితంగా నగర ప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్ గా మారుతుందనటంలో సందేహం లేదు. జూన్ 2న మెట్రో స్టార్ట్ అవుతుందని కోటి ఆశలు పెట్టుకున్న వారికికాస్తంత ఆశాభంగం జరిగినా.. కేటీఆర్ చెప్పినట్లుగా దాదాపు 56 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ సదుపాయం వస్తే.. నగర జీవికి అంతకు మించి కావాల్సిందేముంది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News