అప్రతిహతంగా తెలంగాణలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్రకు దుబ్బాకలో చెక్ పడింది. బీజేపీకి గట్టి షాకిస్తూ విజయం సాధించింది. దుబ్బాక ఉపఎన్నికల్లో అంచనాలన్నింటిని తోసిరాజని బీజేపీ ఘన విజయం సాధించింది. కమలం-కారు మధ్య హోరాహోరీ సాగింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఫలితాల్లో బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలువగా.. కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
దుబ్బక ఉప ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. దుబ్బాకలో ఓటమి టిఆర్ఎస్ పార్టీ.. నాయకులకు ఒక హెచ్చరిక అని కేటీఆర్ అభివర్ణించారు.. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు, గెలుపు కోసం శ్రమించిన మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు చెప్పారు.
దుబ్బాక ఫలితం మేం ఆశించినవిధంగా రాలేదని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తుచేశారు. దుబ్బాక తీర్పును లోతుగా సమీక్షించుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. దుబ్బక అసెంబ్లీలో ఓడిపోతామని ఊహించలేదని, ఇది పార్టీకి, దాని నాయకులకు మేల్కొలుపు గుణపాఠం అని ఆయన అన్నారు. బీజేపీ విజయం ప్రకటన వెలువడిన వెంటనే మంత్రి కేటీఆర్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
"2014 నుండి, మేము చాలా ఎన్నికలలో గెలిచాము. కొన్ని ఓడిపోయాము. కానీ మన పార్టీ చీఫ్ కేసీఆర్ ఎప్పుడూ విజయాలతో పొంగిపోవద్దని.., ఓటములతో కుంగిపోవద్దని చెబుతూనే ఉన్నారు. మాకు ఓటు వేసిన 60,000 బీసీ ఓటర్లకు నా కృతజ్ఞతలు ”అని కెటిఆర్ అన్నారు.
“అవును, మేము ఊహించిన ఫలితం. మాకు అనుకూలంగా లేదు. తప్పకుండా ఏమి జరిగిందో మేము విశ్లేషిస్తాము. మరియు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి తదనుగుణంగా పని చేస్తాము ”అని కెటిఆర్ అన్నారు.
దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత 1118 ఓట్ల తేడాతో బిజెపి రఘునందన్ రావు చేతిలో ఓడిపోయారు.