గ్రేటర్ వార్ జోరు పెరిగింది. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే విషయంలో మహా దూకుడు ప్రదర్శించే టీఆర్ ఎస్.. తన మాటల దాడిని ముమ్మరం చేసింది. తమకు తలనొప్పిగా మారే వారి విషయంలో ఎలాంటి కనికరం లేకుండా అడ్డదిడ్డంగా తిట్టేసే టీఆర్ ఎస్ అధినేతకు తగ్గట్లే ఆయన కుమారుడు.. మంత్రి కేటీఆర్ అదే బాటలో నడుస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. మిగిలిన రాజకీయ పార్టీల కంటే ఒక విమర్శ ఎక్కువగా చేస్తున్నారు.
తాజాగా బీజేపీ పార్టీ అంటే ఏమిటో తెలుసా? అంటూ కమలనాథులకు కరెంటు షాక్ కొట్టే వ్యాఖ్య చేశారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదని.. భారతీయ జోక్ పార్టీ అని తేల్చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మూడు నాలుగు రోజుల ముందు కేంద్రమంత్రి విచ్చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీని తెగ పొగిడేశారు. దార్శనికుడని.. విజన్ ఉన్న నాయకుడని.. ఆయన నేతృత్వంలో దేశం అద్భుతంగా పని చేస్తుందంటూ చాలానే మాటలు చెప్పాలి.
ఓపక్క ప్రధానిని తండ్రి పొగుడుతుంటే.. మరోవైపు అదే ప్రధాని నేతృత్వం వహించే బీజేపీని భారతీయ జోక్ పార్టీ అంటూ ఆయన కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించటం విశేషం. తండ్రేమో పొగడ్తల బాట పడితే.. కొడుకు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం చూస్తే.. రాజకీయం అంటే ఇదేనేమో అనిపించక మానదు.