కేటీఆర్‌ దమ్ముంటే పోటీ చెయ్‌ - పవన్‌ కల్యాణ్‌

Update: 2019-03-22 16:52 GMT
మొన్నటివరకు పవన్‌ కల్యాణ్‌ జనసేన అధిపతి. పేరుకు పార్టీయే కానీ పవన్‌ కల్యాణ్‌ ఒక కరడుగట్టిన రాజకీయ వాదిలాఎప్పుడూ మాట్లాడలేదు. అంతెందుకు గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో నామినేషన్‌ వేసేంతవరకు పవన్‌కల్యాణ్‌ మాట్లాడే స్టైల్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు చోట్ల నామినేషన్‌ వెయ్యగానే పవన్‌ కల్యాణ్‌ లో రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడు. పంచ్‌ లు - ఆరోపణలు - డైలాగ్‌ లతో అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చాడు పవన్‌ కల్యాణ్‌. అలాగే ఏపీలో కేసీఆర్‌ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న తన ప్రసంగంలో కేసీఆర్‌ ని లాగిన పవన్‌.. ఇప్పుడు కేటీఆర్‌ ని లాగాడు.

గతంలో టీఆర్ ఎస్‌ పార్టీని ఏపీలో కూడా పెడతామన్నారు కేటీఆర్‌. అంతేకాదు అన్నీ అనుకున్నట్లు జరిగితే భీమవరం నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు అదే అంశాన్ని భీమవరం సాక్షిగా ప్రస్తావించారు పవన్‌. కేటీఆర్‌ లో భీమవరంలో పోటీ చేసి గెలవాలని అన్నారు పవన్‌. తెలంగాణకు వెళ్తే ఆంధ్రా వాళ్లను కొడుతున్నారన్న పవన్‌.. గొడవలు లేని భీమవరాన్ని తయారు చేస్తానని చెప్పారు. ప్రేమతో - సహనంతో దేన్నయినా జయించవచ్చునని - అందుకే తాను భీమవరం నుం చి పోటీ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్‌ కు ఆంద్రాలో ఏం పని అని ఆయన అన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్ల రాజకీయాలు అవసరం లేనప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు పైనా విమర్శలు గుప్పించారు పవన్‌. చంద్రబాబు పెద్దవారై పోయారని - ఆయన రిటైర్ మెంట్ ప్రకటించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలని ఆయన అన్నారు. జగన్ తన బాబాయి హత్యకు గురైతేనే ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు. గ్రంధి శ్రీనివాస్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అని కాకుండా - టిఆర్ ఎస్ అభ్యర్ది అని చెప్పండని పవన్ కళ్యాణ్ అన్నారు . ఇక ఫైనల్‌ గా కేసీఆర్‌ అంటే తనకు గౌరవం ఉంది కాని భయం లేదని ఆయన అన్నారు. టిఆర్‌ య‌స్ ఏపి లో పోటీ చేయాల‌ని సూచించారు పవన్‌ కల్యాణ్‌. మొత్తానికి కేసీఆర్‌ ని, కేటీఆర్‌ ని ప్రస్తావించడం ద్వారా భీమవరంలో సెంటిమెంట్‌ ని రగిల్చే ప్రయత్నం చేశారు పవన్‌.
Tags:    

Similar News