కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. మోడీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు అంటే.. మోడీ - ఈడీయేనని వ్యాఖ్యానించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధినేతగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నియమించి నందుకు ప్రధాని మోడీకి ధన్యవాదా లు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై కేటీఆర్ పలు అంశా లపై ట్విటర్లో తనదైన శైలిలో స్పందించారు.
'దేశంలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ'అని అర్థమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దేశంలో ఉన్న డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ అని అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు ఆదాని అంశంపైనా స్పందించిన కేటీఆర్... ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం... నైజీరియాను అధిగమించిందని.. ఇదే సమయంలో ఆదానీ బిల్ గేట్స్‌ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు.
ఇవి దేశానికి సంబంధించి రెండు కఠోర వాస్తవాలను అని కేటీఆర్ పేర్కొన్నారు. రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను ఎత్తివేస్తుందన్న వార్తలపైనా స్పందించిన కేటీఆర్... రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే కాదని, విధి కూడా అన్న ఆయన... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బాధాకరమని వ్యాఖ్యానించారు. కరుణా హృదయంతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
ఇంతకీ బండి కామెంట్స్ ఏంటంటే
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ధాన్యాన్ని కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలంలో ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జెండా అంటే కేసీఆర్ కుటుంబం వణుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.
ఈ తెలంగాణ కుటుంబ పార్టీ ఏమైనా గుత్తా పట్టుకుందా..? ముఖ్యమంత్రి కేసీఆర్ వాతావరణ శాస్త్రవేత్త. ముఖ్యమంత్రి నదులకు నడక నేర్పారని మంత్రి కేటీఆర్ చెప్పుకుంటుండు.. మరి అదే ముఖ్యమంత్రి నీళ్లలో మునిగిన మోటార్లకు ఈత ఎందుకు నేర్పలేదు.? రాష్ట్రంలో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. శ్రీలంకలో ఉన్నట్టు రాష్ట్రంలో పరిస్థితి ఉంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.