మ‌రి.. సోనియా ఇంటికి ఎందుకు వెళ్లిన‌ట్లు కేటీఆర్‌?

Update: 2017-05-26 04:22 GMT
విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో రాజ‌కీయ అంశాలు త‌క్కువ‌గా.. ప్ర‌భుత్వ ఇమేజ్ ను పెంచేలా నేత‌ల మాట‌లు ఉంటాయి వీలైనంత వ‌ర‌కూ హుందాగా మాట్లాడ‌టం కనిపిస్తుంది. హైద‌రాబాద్ లో మాట్లాడిన‌ట్లు.. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించిన‌ట్లు మాట్లాడ‌టం అన్న‌ది ఉండ‌దు. కానీ.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే అందుకు భిన్నంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట‌లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. ఆయ‌న  స్పీచ్ అవాక్కు అయ్యేలా చేసింది.

ప్ర‌తిప‌క్షాల‌పై త‌న‌దైన శైలిలో ఫైర్ అయ్యే ఆయన.. అమెరికాలోనూ అదే రీతిలో స్పీచ్ ఇచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారాలో టీఆర్ఎస్ యూఎస్ శాఖ స‌మావేశంలో ప్ర‌సంగించారు. పార్టీ వేదిక కావ‌టంతో.. కేటీఆర్ లో నిజ‌మైన నేత నిద్ర లేచారు. అప్ప‌టివ‌ర‌కూ దౌత్య సిబ్బందితోనూ.. ప‌లువురు కంపెనీల ప్ర‌తినిధ‌లతో మాట్లాడే మాట‌ల‌కు భిన్నంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.

టీఆర్ఎస్ మూడేళ్ల పాల‌న గురించి గొప్ప‌గా చెప్పుకొన్న ఆయ‌న‌.. ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ తెలంగాణ జెండా ఎగ‌రాల‌న్నారు.

పార్టీ అధినేత కేసీఆర్ త‌న ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి తెలంగాణ సాధించార‌ని.. అద్భుత‌మైన ప‌థ‌కాల‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిపిన‌ట్లుగా పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో హామీ ఇవ్వ‌ని ప‌థ‌కాల్ని కూడా తెర మీద‌కు తెస్తున్నార‌ని.. ప్ర‌జ‌లు కోరుకోకున్నా.. వారి అవ‌స‌రాల్ని గుర్తించి కొత్త ప‌థ‌కాల్ని అమ‌ల్లోకి తెస్తున్న‌ట్లు చెప్పారు. ఇంఉద‌కు క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాన్ని ఉద‌హ‌రించారు.

మిష‌న్ కాక‌తీయ‌లో 46 వేల చెరువుల‌ను పున‌రుద్ధ‌రించామ‌ని.. ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీళ్లు ఇచ్చేందుకు మిష‌న్ భ‌గీర‌థ‌ను చేప‌ట్టిన విష‌యాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే పంచ మ‌హాపాత‌కాలు చుట్టుకుంటాయ‌ని.. వేయి మంది విద్యార్థుల బ‌లిదానాల‌కు కాంగ్రెస్ పార్టీయే కార‌ణంగా చెప్పుకొచ్చారు. మ‌రి.. కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడితేనే పంచ మ‌హాపాత‌కాలు చుట్టుంటే.. ఆపార్టీ అధినేత్రి ఇంటికి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఎందుకు వెళ్లిన‌ట్లు?
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన విందును ఎందుకు స్వీక‌రించిన‌ట్లు? అప్పుడు కాంగ్రెస్ అధినేత్రి ఇంటికి వెళ్లి తింటే అంట‌ని పాపం.. ఇప్పుడా పార్టీ గురించి మాట్లాడితేనే వ‌చ్చేస్తుందా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News