తెలంగాణలో 'పసుపు' ను నిషేధించేలా ఉన్నారే!

Update: 2015-03-18 05:57 GMT
మామూలుగా హిందువులు పసుపును మంగళకరంగా భావిస్తారని.. అయితే తెలంగాణలో మాత్రం ఆ పసుపు అమంగళకరంగా మారిందని అంటున్నాడు తెలంగాణ రాష్ట్ర సమితి నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్‌. తెలుగుదేశం పార్టీ పై విరుచుకుపడుతూ కేటీఆర్‌ ఈ వ్యాఖ్యానాలు చేశాడు.

    తెలుగుదేశం పార్టీ అధికార రంగు పసుపు. ఎన్టీఆర్‌ ఆ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి పసుపును అధికారం చేసుకొంది. పచ్చ జెండా ఎగరేస్తోంది. తెలుగుదేశం నేతలు పచ్చ చొక్కాలుగా పేరు పొందారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రంగును అధికారం ముద్రగా చేసుకొన్న నేపథ్యంలో తెలుగుదేశం 'పసుపు' పార్టీగా గుర్తింపు సంపాదించింది. పసుపు మంగళకరం అనే భావనతోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ రంగును తమ అధికారిక చిహ్నంగా మార్చుకొన్నారు.

    మరి ఇప్పుడు పసుపు ను చూస్తేనే తెరాస వాళ్లకు మండుతున్నట్టుగా ఉంది. ఎలాగైనా తెలంగాణలో తెలుగుదేశంపార్టీని తుడిచిపెట్టడమే లక్ష్యంగా చేసుకొన్న తెరాస వాళ్లు ఇప్పుడు 'పసుపు'పై తమకున్న అలర్జీని బయటపెట్టుకొన్నారు.

    అది మంగళకరం కాదు.. అమంగళకరం అని కేటీఆర్‌ వ్యాఖ్యానించాడు. మరి ఈ తీరును చూస్తుంటే తెలంగాణలో ఎక్కడా పసుపు రంగు కనపడకూడదని.. తెలంగాణ ప్రజలు పసుపును వినియోగించకూడదని కూడా గులాబీ చొక్కాలు పిలుపునిస్తాయో ఏమో!

Tags:    

Similar News