వెంట్రుక పీక‌లేరంటూ అన్నేసి మాట‌లా కేటీఆర్?

Update: 2018-05-02 05:49 GMT
ప్ర‌త్య‌ర్థుల్ని అదే ప‌నిగా బండ‌కేసి బాదేసిన‌ట్లుగా తిట్టేసే అల‌వాటు టీఆర్ ఎస్ అధినేత మొద‌లు ఆ పార్టీ నేత‌ల‌కు ఒక ఆయుధ‌మ‌ని చెప్పాలి. ఓప‌క్క త‌మను దెబ్బే తీసే వారిని సైతం.. పుల్ల‌ల మాదిరి తీసేసే అల‌వాటు వారిలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. నిజంగా ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేర‌న్నదే నిజ‌మైతే..మ‌రి.. అంత‌లా ఎందుకు విరుచుకుప‌డుతున్నార‌న్న లాజిక్ క్వ‌శ్చ‌న్‌కు స‌మాధానం ల‌భించ‌దు.

అధికార‌ప‌క్షం అన్నాక విమ‌ర్శ‌లు మామూలే. త‌మ‌పై వేలెత్తి చూపించే వారికి స‌మాధానం ఇవ్వ‌టం అధికారంలో ఉన్న వారికి అల‌వాటే. అయితే.. ఇవేమీ శృతిమించిన‌ట్లుగా ఉండ‌కూడ‌దు. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేస్తున్న నేప‌థ్యంలో నాలుగేళ్లుగా పెద్ద‌గా ప‌ట్ట‌న‌ట్లుగా ఉన్న వారు సైతం బ‌ద్ధ‌కాన్ని ప‌క్క‌న పెట్టేసి క‌ద‌న‌రంగంలోకి దూకుతున్నారు.

ఇక‌.. ఇప్ప‌టికే రంగంలో ఉన్న వారు త‌మ విమ‌ర్శ‌ల తీవ్ర‌త‌ను మ‌రింత పెంచుతున్నారు. మాట అన‌ట‌మే కానీ ఎదురు ప‌డ‌టం ఏమాత్రం ఇష్టం లేని టీఆర్ ఎస్ నేత‌ల‌కు  కాంగ్రెస్ నేత‌ల మాట‌లు మంట పుట్టిస్తున్నాయి.

ఇక‌.. సూటిగా కొట్టిన‌ట్లుగా ఉండే ఉత్త‌మ్ కుమార్ మాట‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రి కేటీఆర్ అండ్ కోల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తున్నాయి.

నిత్యం కేసీఆర్ ను టార్గెట్ చేయ‌టం.. ఆయ‌న అధికారిక నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను ఉద్దేశించి ఉత్త‌మ్ చేస్తున్న వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ నేత‌ల‌కు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అందుకే.. ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా ఉత్త‌మ్ ను ఉతికి ఆరేస్తున్నారు. మొన్నన టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉత్త‌మ్‌ను ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా ఉత్త‌మ్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డే బాధ్య‌త‌ను తీసుకున్నారు మంత్రి కేటీఆర్‌.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీక‌లేవంటూ ఫైర్ అయిన ఆయ‌న‌.. ఉత్త‌మ్ మాట‌ల్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ పాట‌కీలు బ‌ద్ధ‌లు కొడ‌తామ‌న్న ఉత్త‌మ్ మాటల‌కు కౌంట‌ర్ గా కేసీఆర్ ఎంట్రుక కూడా పీక‌లేర‌ని.. కేసీఆర్ ను.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని తిట్ట‌ట‌మే ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిగా మారింద‌ని మండిప‌డ్డారు.  

ఎవ‌రెన్ని తిట్టినా.. అవ‌న్నీ త‌మ‌కు దీవెన‌లే అవుతాయ‌న్న ఆయ‌న‌.. క‌ష్టాల్లో ఉన్న వారికి ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేట్లు తెరుచుకోవ‌టం లేద‌న్న మాట‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

కాంట్రాక్ట‌ర్లు.. బ్రోక‌ర్లు.. ప్ర‌గ‌తి నిరోధ‌కుల కోసం ప్ర‌గ‌తిభ‌వ‌న్ గేట్లు తెరుచుకోవ‌ని.. క‌డుపు నిండా విషం నింపుకున్న వాళ్ల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి ఎందుకు ఆహ్వానించాల‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ దిష్టి బొమ్మ‌లు కాల్చినంత ఎక్కువ‌గా మ‌రే నేత దిష్టిబొమ్మ‌ల్ని కాల్చి ఉండ‌ర‌న్నారు.

దిష్టిబొమ్మ‌ల్ని కాల్చ‌టం ద్వారా కేసీఆర్‌ కు ఉన్న దిష్టి మొత్తం పోయింద‌న్న కేటీఆర్‌.. సీఎం కేసీఆర్ కార్మికుల ప‌క్ష‌పాతిగా వ్యాఖ్యానించారు. ఉత్త‌మ్ అండ్ కోను ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే..

+ వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ గెలవకపోతే ఉత్త‌మ్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నారు. గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్‌సింగులు కాలేరు.  గడ్డం పెంచుకుంటా అనే నువ్వు ఉంటే ఏంది? ఏడ పోతే ఏంది? నీతో మాకు వచ్చేది ఏముంది?’’
 
+ ఉత్తమ్‌ - జానా - షబ్బీర్‌ లు ఆకాశం నుంచి వచ్చిన గందర్వుల్లా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ల టీఆర్ ఎస్ పాల‌న‌ను ఆడిపోసుకుంటున్నారు.  ఎన్నో ఏళ్లపాటు పాలన సాగించిన కాంగ్రెస్‌ను ఏమ‌నాలి?  

+ సమ్మెలు, ఆందోళనలు చేపట్టకుండా.. కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వకుండానే సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతమాత్రాన కార్మికులకు సమస్యలు లేవని నేను అనడం లేదు. కాస్త ఆలస్యమైనా ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం
.
+ గత పాలకుల హయాంలో అంగన్ వాడీల‌ను గుర్రాలతో తొక్కించారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మరీ జీతాలు పెంచారు. వీఆర్ఏలు.. ఆశావర్కర్లు.. హోంగార్డుల జీతాలను పెంచారు. సింగరేణి కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచి వాళ్ల కష్టాలు విన్న గొప్ప నేత కేసీఆర్‌.
 
+ కారుణ్య నియామకాల సమస్యను పరిష్కరించారు. అయినా, కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారు. సాధారణంగా కార్మికులు సమ్మెలు, ఆందోళనలు చేస్తారు. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమల యాజమాన్యాలు ధర్నాచౌక్‌లో ఆందోళనకు దిగాయి.

+ కాంగ్రెస్‌ తన అసమర్థతతో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇస్తే లక్షలాదిమంది కార్మికులు రోడ్డుపాలయ్యారు.  తెలంగాణ వచ్చిన ఆరు నెలలకే పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇచ్చి మూడు షిఫ్టుల్లో పని చేసుకునే అవకాశాన్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం కల్పించింది.

+ సకల జనుల సమ్మెలో పాల్గొని అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి చెమటలు పట్టించిన చరిత్ర కార్మికులది. వాళ్ల పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైంది.  కార్మికులంతా కేసీఆర్‌, టీఆర్ఎ్‌సకు అండగా ఉండాలి.  

Tags:    

Similar News