దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఫాలో అవుతున్నారు. ఏంటి నిజమేనా అని ఆశ్చర్యపోకండి. నిజ్జంగా నిజమే. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తన సొంత నియోజకవర్గమైన పులివెందులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పులివెందుల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేశారు. ఇపుడు సేమ్ పాలసీని కేటీఆర్ ఫాలో అవుతున్నారు.
కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు వరాల జల్లు కురిపించారు. నియెజకవర్గ నాయకులతో హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో పట్టణాభివృద్ది పట్ల తనకున్న అలోచనలను పంచుకున్న మంత్రి కేటీఆర్ సిరిసిల్లా రూపు రేఖలు మార్చేందుకు నియోజకవర్గ ప్రజలు, నాయకులు కలిసిరావాలని కోరారు. రాజకీయ బిక్ష పెట్టిన నిలబెట్టిన సిరిసిల్లాను అభివృద్ది పథాన నిలబెట్టడమే ఏకైక లక్ష్యంగా పనిచేద్దామన్నారు. దశాబ్దాల తర్వతా ప్రభుత్వంలో ఉండే అవకాశం సిరిసిల్లా ఎమ్మెల్యేకి లభించిందని, మంత్రిగా తాను సిరిసిల్లా రుణం తీర్చుకునేలా పనిచేస్తాన్నారు. ఇప్పటికే కొంత అభివృద్ది జరుగుతున్నా, చేయాల్సింది చాలనే ఉందన్నారు. వచ్చే ఏన్నికల నాటికి పట్టణ ప్రజలే నమ్మలేనంతగా పట్టణానాన్ని తీర్చిదిద్దుదామన్నారు. సిరిసిల్లా పట్టణాన్ని గ్రేటర్ సిరిసిల్లాగా మారుస్తామన్నారు. దీంతో పాటు రూ.60 కోట్లతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే విధంగా రూ.10 కోట్లతో మోడల్ స్కూల్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిరిసిల్లను అమృత్ పథకంలో చేర్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పట్టణానికి కనురెప్పపాటు కరెంటు పోకుండా సెస్ సహకారంతో ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. వంద శాతం మురుగుదొడ్లు - రోడ్లు సౌకర్యాలను రాబోయే మూడు సంవత్సరాల్లో అందిస్తామన్నారు. సిరిసిల్లాకి 1500 డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ సంవత్సరంలో మంజూరీ చేయిస్తామని చెప్పారు. సిరిసిల్లా నుంచి సిద్దిపేట, సిరిసిల్లా నుంచి కామరెడ్డి వరకి హైవేల విస్తరణ చేయిస్తామని హామీ ఇచ్చారు.