హుస్నాబాద్ స‌భ కేటీఆర్ కు బ్యాడ్ న్యూస్‌!

Update: 2018-09-08 06:01 GMT
ఊహించిన‌ట్లే కేటీఆర్ కు షాక్ త‌గిలింది. కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా అప్ర‌క‌టిత హోదాలో చెల‌రేగిపోతున్న ఆయ‌న‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను నిర్వ‌హిస్తామంటూ కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం.. ఇందులో భాగంగా ముందుండి మ‌రీ స‌భా ఏర్పాట్లు చేశారు కేటీఆర్‌. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ మొత్తాన్ని తానే ముందుండి న‌డిపించారు.

కేసీఆర్ గొప్ప‌లు చెప్పుకున్న‌ట్లుగా  ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు పాతిక ల‌క్ష‌ల మంది రావ‌టం త‌ర్వాత.. ప‌ట్టుమ‌ని ప‌ది ల‌క్ష‌ల మంది కూడా రాలేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కోసం దాదాపు రూ.300 కోట్లు ఖ‌ర్చు పెట్టినా.. ఫ‌లితం రాక‌పోవ‌టంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డీలా ప‌డినట్లుగా వార్తలు వ‌చ్చాయి.

ప్ర‌గ‌తి నివేద‌న స‌భతో త‌గిలిన షాక్ నుంచి తేరుకోవ‌టానికి.. టీఆర్ఎస్ ప‌క్షాల్లో జోరు పెంచ‌టానికి వీలుగా హుస్నాబాద్ లో బ‌హిరంగ స‌భ‌ను ప్ర‌క‌టించారు. ఈ స‌భా నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను మేన‌ల్లుడు క‌మ్ తాజా మాజీ హ‌రీశ్‌కు అప్ప‌జెప్పారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ఏర్పాట్లు విష‌యంలో హ‌రీశ్  వేలు పెట్ట‌నివ్వ‌క‌పోవ‌టం త‌ర్వాత గోరు కూడా పెట్ట‌కుండా వ్య‌వ‌హ‌రించిన కేటీఆర్ అడ్డంగా ప్లాప్ కావ‌టం ఒక ఎత్తు అయితే.. హ‌రీశ్ నిర్వ‌హ‌ణ‌లో జ‌రిపిన హుస్నాబాద్ స‌భ హిట్ కావ‌టం గ‌మ‌నార్హం.

హుస్నాబాద్ స‌భ‌కు అనుకున్న 60వేల మంది కంటే ఎక్కువ‌గా.. దాదాపు ల‌క్ష వ‌ర‌కూ జ‌నాభా హాజ‌రైన‌ట్లుగా చెబుతున్నారు. స‌భ‌ల్ని నిర్వ‌హించ‌టం.. అందుకు అవ‌స‌ర‌మైన జ‌న స‌మీక‌ర‌ణ‌ను అంచ‌నాల‌కు మించి తీసుకురావటం అంత తేలికైన విష‌యం కాదు. తాజా స‌భ‌తో తేలిందేమంటే.. కేటీఆర్ లో లేనిదేమిటి?  హ‌రీశ్ లో ఉన్న‌దేమిటి? అన్న‌ది గులాబీ బ్యాచ్ కు స్ప‌ష్టంగా తెలిసింద‌ని చెప్పాలి.

ముంద‌స్తుకు వెళుతున్న కేసీఆర్‌.. త‌న తొలి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌న‌ను హుస్నాబాద్ స‌భ‌తో షురూ చేశార‌ని చెప్పాలి. ఈ స‌భ‌ను డ‌ప్పులు ద‌రువు.. నృత్యాల జోరు.. కోలాటాల హోరు.. బ‌తుక‌మ్మ ఆట‌లు.. తెలంగాణ పాట‌లు.. ఊరేగింపులు ఇలా సంద‌డి సంద‌డిగా సాగింది. హ‌రీశ్ కు బాధ్య‌త అప్ప‌గించిన హుస్నాబాద్ బ‌హిరంగ స‌భ భారీ స‌క్సెస్ కావ‌టం గులాబీ శ్రేణుల్లో సంతోషాన్ని నింపిన‌ట్లుగా చెబుతున్నారు.  అదే స‌మ‌యంలో హ‌రీశ్ సామ‌ర్థ్యం ఎంత‌టితో గులాబీ ద‌ళానికి అర్థ‌మైన‌ట్లుగా చెబుతున్నారు.

త‌న కుమారుడ్ని త‌న రాజ‌కీయ వార‌సుడిగా  అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని ఉత్సాహ‌ప‌డుతున్న కేసీఆర్ కు ఇబ్బందిక‌రంగా హుస్నాబాద్ స‌భ స‌క్సెస్ మారింద‌న్న మాట వినిపిస్తోంది. స‌భ‌కు చెప్పిన‌ట్లే 60 వేల మందిని తీసుకొచ్చే విష‌యంలో ప‌క్కా ప్లానింగ్ తో వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు... స్థానిక నేత‌ల‌కు టార్గెట్లు అప్ప‌జెప్పి మ‌రీ జ‌న‌స‌మీక‌ర‌ణ మీద ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌టంతో హుస్నాబాద్ స‌భ‌కు జ‌నం పోటెత్తార‌ని చెప్పాలి. మండ‌లాల వారీగా నేత‌ల‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం స్ప‌ష్ట‌మైన‌ టార్గెట్లను హ‌రీశ్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తానికి త‌న కొడుకు మొన‌గాడిత‌నాన్ని ప్ర‌మోట్ చేయాల‌ని.. అత‌గాడెంత స‌మ‌ర్థుడ‌న్న విష‌యాన్ని చాటుకోవాల‌నుకున్న కేసీఆర్ కు హుస్నాబాద్ స‌భ రూపంలో ఎదురుదెబ్బ త‌గిలింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.


Tags:    

Similar News