ఏపీ సీఎం జగన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని.. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ట్విట్టర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కృష్ణ జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడుతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశామన్నారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని.. త్వరలోనే దీనిపై ప్రకటనలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.వైద్య రంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కరోనాతో ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా చికిత్సలో దోపిడీపై రెండు ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైల్ సర్వీసులను తిరిగి నడిపేందుకు కేంద్రం అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.