కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ మాటలు తనను ఎంతో బాధకు గురి చేసినట్లుగా చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఈ మధ్యన లోక్ సభ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి గడిచిన ఆరేళ్లలో కేంద్రం నుంచి ఎంత మొత్తం ఇచ్చారంటూ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణకు తాము లక్షన్నర కోట్ల వరకూ ఇచ్చినట్లుగా కేంద్రమంత్రి చెప్పారు.
ఈ ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఐదేళ్ల వ్యవధిలో రూ.2.72లక్షల కోట్లను చెల్లించినట్లుగా పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తాన్ని తమ నుంచి కేంద్రానికి వెళితే.. తమకు వచ్చింది మాత్రం రూ.1.12లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు.
కేంద్రం ఇచ్చిన రాష్ట్ర వాటా తక్కువగా ఉందన్న ఆయన..తెలంగాణకు అధిక నిధులు ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు తనకు బాధను కలిగించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ మేరకు నిధులు విడుదల చేసిందనే విషయాన్ని తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇన్ని మాటలు చెబుతున్న మంత్రి కేటీఆర్.. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మర్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం అందేది హైదరాబాద్ మహానగరం నుంచే. మరి.. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.1.2 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. మరి.. ఇంత భారీ బడ్జెట్ లో హైదరాబాద్ మహానగరానికి కేటాయిస్తున్నది ఎంత? అన్నది ప్రశ్న. అత్యధిక ఆదాయాన్ని అందించే హైదరాబాద్ మహానగరంలో ఈ రోజు నీళ్ల కోసం నగరవాసి పడే కష్టం అంతా ఇంతా కాదు. ట్రాఫిక్ ఈతి బాధల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి.. అలాంటప్పుడు తాము చేయని పనిని కేంద్రం చేయలేదని ప్రశ్నించటంలో అర్థముందా? అన్నది ప్రశ్న.
కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న వాటా గురించి తనకు బాధ కలిగిందని చెబుతున్న కేటీఆర్.. మరి తమ రాష్ట్రంలో.. తమ ప్రభుత్వం అత్యధిక రెవెన్యూ ఇచ్చే హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల్ని పెంచటానికి బదులు.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రాధాన్యత ఇవ్వటంలో అర్థమేముందని అడిగితే పరిస్థితి ఏమిటి? లెక్కలు అడగటంతో తప్పు లేదు. కానీ.. వాటికి కొత్త అర్థాలు తీసే ముందు తామేం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందేమో?