మునుగోడు ఉపపోరు హీట్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఉప ఎన్నికలు మామూలే అయినా.. తాజా ఉప ఎన్నిక అందుకు భిన్నమన్న సంగతి తెలిసిందే. బరిలో ఉన్న మూడు పార్టీలకు గెలుపు తప్పనిసరి కావటం.. తెలంగాణ రాజకీయ రూపురేఖల్ని మార్చేసే సత్తా ఈ ఉప పోరు సొంతమని చెప్పాలి. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. వేలాది కోట్ల రూపాయిల కాంట్రాక్టు తీసుకొని.. లబ్థి పొందారంటూ ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. 'కేటీఆర్.. నీకు 24 గంటలు టైమిస్తున్నా.. నా మీద చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని చూపించాలి' అని అన్నారు.
ఒక టీవీ చానల్ చర్చలో పాల్గొన్న రాజగోపాల్ తనకు రూ.18వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కినందుకే బీజేపీలో చేరినట్లుగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు జతగా ఒక వీడియో క్లిప్ ను పోస్టు చేశారు. క్విడ్ ప్రోకోకు రాజగోపాల్ రెడ్డి పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి వేళ.. రియాక్టు అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను బీజేపీలో చేరేందుకు రూ.18వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందన్న మంత్రి కేటీఆర్ పై మండిపడిన ఆయన.. కేటీఆర్ చేసిన ఆరోపణను ఆధారాలతో నిరూపించాలన్నారు. అలా చేస్తే.. తాను తప్పు చేసినట్లుగా తేలితే తాను మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయనని.. ఆ మాటకువస్తే రాజకీయాల్ని కూడా వదిలేస్తానంటూ భారీ సవాలు విసిరారు. కేటీఆర్ కు తాను 24 గంటల సమయం ఇస్తున్నానని.. తన సవాలుకు సమాదానం చెప్పాలన్నారు. కోమటిరెడ్డి విసిరిన సవాలు బంతి ఇప్పుడు కేటీఆర్ కోర్టులో ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.