2009, డిసెంబర్ 9కి తెలంగాణకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. రాష్ట్రం కోసం సకలజనులు సమ్మెకు ఆందోళనకు దిగారు. రాష్ట్రం అట్టుడుకడంతో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. కేసీఆర్ ఆస్పత్రిలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని ప్రకటించారు.
ఈ సంఘటన జరిగిన నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఈ గొప్ప రోజును గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ దీక్షపై వచ్చిన ఓ పత్రిక కథనాన్ని ట్వీట్ చేసి ఇలా రాసుకొచ్చాడు.
‘ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. ’ అన్న ఉద్యమ వీరుడిని ప్రస్థానానికి నేటితో పన్నేండేళ్లు. జై కేసీఆర్.. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ రాసిన సంపాదకీయం ‘ఒక దీక్ష, ఒక విజయం.. ఒక యాది’ ని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రకటించిన డిసెంబర్ 9, సోనియా గాంధీ బర్త్ డే ఒక్కటే రోజు. సోనియా తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా మిగిలిపోయారు.