తెలంగాణ రాష్ట్ర సమితికి మంచి రోజులు కనపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీపైనా... ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు.
కాసింత ఆగ్రహంగానే చంద్రశేఖర రావు ప్రసంగించారు. దీంతో తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రుల మనసు నొచ్చుకుందని - వారంతా తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర సమితి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు - మంత్రి కె. తారక రామారావే జోక్యం చేసుకుని నగరంలోని వివిధ కాలనీల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్లతో సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన ప్రసంగాలపై వివరణ ఇచ్చారు.
తమకు రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత వైరం లేదని - తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడున్న సెటిలర్లు ఎంత హాయిగా ఉన్నారో అందరికి తెలిసిందేనంటూ సెటిలర్లను చల్లబరిచారు. నగరంలో దాదాపు పదిహేను సమావేశాలకు పైగా ఏర్పాటు చేసి సెటిలర్లతో మమేకమ్యారు. తమ వైరం తెలుగుదేశం పార్టీతోనే అని సెటిలర్లకు నచ్చచెప్పే ధోరణిలో ప్రసంగించారు. ఒకటి రెండు చోట్ల జరిగిన సమావేశాల్లో మంత్రి కె.తారక రామారావును కొందరు సెటిలర్లు తమ సందేహాలను తీర్చుకొనేందుకు ప్రశ్నించారు కూడా. వీటన్నిటికి మంత్రి తారక రామారావు సానుకూలంగానే స్పందించారు. ఈ సమావేశాల అనంతరం తెలంగాణలో ఉన్న సెటిలర్లలో ఎంతో మార్పు వచ్చిందని - వారంతా సామూహికంగా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను వర్తమానం అందినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాని - ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కాని తమకు ఇబ్బందులు ఎదురుకాలేదన్న వాస్తవాన్ని సెటిలర్లు గుర్తించినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా కూకట్ పల్లి - శేరిలింగపల్లి - మల్కాజిగిరి - పటాన్ చెరు - జూబ్లీహిల్స్ - ఖైరతాబాద్ - ఉప్పల్ నియోజకవర్గాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్లు ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా పని చేయాలని నిర్ణయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలించే అంశంగా చెబుతున్నారు.