అభ్య‌ర్థుల ఎంపిక‌లో కేటీఆర్ మార్క్!

Update: 2018-09-11 16:25 GMT
తెలంగాణ‌లో అసెంబ్లీ ర‌ద్దు చేసిన ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్...అదే రోజున 105మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే - ఆ జాబితాలో కేటీఆర్ మాట ఇచ్చిన కొంత‌మంది అభ్య‌ర్థుల పేర్లు లేవని...వారి కోసం కేసీఆర్ తో కేటీఆర్ సిఫార‌సు చేస్తున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. అయితే, ఆ 105 మందిని కేసీఆర్ త‌న స‌ర్వేలు....ఇంటెలిజెన్స్....వేగుల ద్వారా ఎంపిక చేశారా...? అందులో కేటీఆర్ పాత్ర కించిత్త‌యినా లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు కాద‌నే స‌మాధాన‌మే టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ రాజ‌కీయ వార‌సుడిగా....రాబోయే కాలంలో కాబోయే తెలంగాణ సీఎంగా ఖ్యాతికెక్కిన కేటీఆర్....ఆమోదంతోనే ఆ 105 మంది ఎంపిక జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఆ జాబితాను సిద్ధం చేయ‌డంలో తండ్రికి త‌న‌యుడు కేటీఆర్ పూర్తి స‌హాయ‌ స‌హ‌కారాలు అందించార‌ట‌. ఈ రెండు చేతుల మీదుగానే...ఆ జాబితా మొత్తం సిద్ధ‌మ‌యిందని టాక్.

కేసీఆర్ తో పాటు త‌న‌కూ విధేయులుగా ఉంటూ...పార్టీ ప‌ట్ల‌ విశ్వసనీయత క‌న‌బ‌రుస్తోన్న సమర్థులైన నాయ‌కుల‌కే ఆ ఇద్ద‌రూ టికెట్లు కేటాయించార‌ట‌. ఆ 105మంది జాబితా కోసం కొన్నినెలల నుంచి కేటీఆర్ రిపోర్ట్ రెడీ చేస్తున్నార‌ట‌. తండ్రీ కొడుకులిద్ద‌రూ...త‌మ‌దైన శైలిలో ఆ అభ్య‌ర్థుల‌ను జ‌ల్లెడ ప‌ట్టార‌ట‌. జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్ దృష్టిసారించాల‌న్న ఉద్దేశంతోనే కేటీఆర్ కు శిక్ష‌ణ‌నిచ్చార‌ని టాక్. 2019లో టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే...కాబోయే సీఎంగా కేటీఆర్ కు వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌ను కేసీఆర్ నేర్పిస్తున్నార‌ట‌. అందుకే, ప్రతి అభ్యర్థిని కేటీఆర్ స్కాన్ చేసి...త‌న‌ తండ్రికి రిపోర్ట్ ఇచ్చార‌ట. ఆ మాట‌కొస్తే చాలా కాలం నుంచే  కాబోయే సీఎంగా కేటీఆర్ ను కేసీఆర్ ఎక్స్ పోజ్ చేస్తున్నారు. మెట్రోరైలు ప్రారంభోత్సవం, మహిళా పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ సదస్సు ...వంటి సంద‌ర్భాల్లో కేటీఆర్ ను కేసీఆర్ హైలైట్ చేశారు. కేసీఆర్ ప‌క్క‌న ఉన్నా....కేటీఆర్ తో మోదీ మాట్లాడ‌డం.... కేటీఆర్ ను ఇవాంకా ట్రంప్ అమెరికాకు ఆహ్వానించ‌డం...వంటివి ఆ ఎక్స్ పోజ‌ర్ లో భాగ‌మే. సో, ఈ కార‌ణాల‌తో కేసీఆర్ కుర్చీ వారసుడు కేటీఆరేన‌ని ....అతి స‌మీపంలో కేటీఆర్ ను సీఎంగా చూడ‌బోతున్నామ‌ని టీఆర్ ఎస్ వర్గాలు బ‌లంగా ఫిక్సయ్యాయ‌ట‌.

Tags:    

Similar News