తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరమైన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని ప్రచారం జరుగుతోంది. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని విపక్ష పార్టీలు విమర్శించే టీఆర్ఎస్‌లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ మధ్య వారసత్వ వార్ జరుగుతుందనే చర్చ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్‌లోకి తాజా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ - ఎంపీ కవిత కూడా చేరానని అంటున్నారు. ప్రగతి సభల పేరుతో మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హరీశ్ రావు, కవిత ఓ వైపు...కేటీఆర్ మరోవైపు ఉన్నారని అంటున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. అనంతరం బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన నియోజకవర్గ అభివృద్ధి ప్రగతి సభలో హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిస్తే, టీఆర్ ఎస్ ప్రభుత్వం మూడున్నరేండ్లలోనే 20 లక్షల ఎకరాలకు నీరిచ్చిందని, డిసెంబర్ నాటికి మరో 10 లక్షల నుంచి 15లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని చెప్పారు. కాళేశ్వరం నీటితో జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. దేశంలో అందరూ కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం నొచ్చుకుంటున్నారని విమర్శించారు. గతంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డి ఏనాడైనా రైతుల గురించి ఆలోచించారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అబ్బురపడ్డారని - పనుల్లో నాణ్యత - పని నడిచే విధానం - ప్రాజెక్టు తీరుతెన్నులపై ఆసక్తి కనబరిచారని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధికి రూ.4,633 కోట్లు మంజూరు చేసిందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి నాలుగేండ్లకాలం సంక్షేమానికి స్వర్ణయుగమని రాష్ట్ర ఐటీ - పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. సంక్షేమరంగంలో నాలుగేండ్లలో ఇన్ని కార్యక్రమాలు చేయవచ్చా! అని దేశం మొత్తం అబ్బురపడి చూసేలా కేసీఆర్ పాలన సాగుతున్నదని అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయద్దేరినట్టు కాంగ్రెస్ నాయకుల కథ ఉందని ఎద్దేవాచేశారు. సోమవారం ఖమ్మంజిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే.. మన సీఎం నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కూడా కావాలని అంటున్నారని కేటీఆర్ చెప్పారు. సీతారామ - కాళేశ్వరం - పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి, మనకు రావాల్సిన 1200 టీఎంసీల నీటిని తీసుకొస్తామని అన్నారు. మాట నిలబెట్టుకునే సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 2,630 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేశారని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తున్నామని, ఖమ్మం రూపురేఖలు మార్చామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను ఖమ్మంలా తీర్చిదిద్దితే తన పదవికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. కాగా, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా రాష్ట్రాన్ని చుట్టేయడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. అదే సమయంలో అన్నా చెల్లెళ్లు అయిన కేటీఆర్, -కవిత కాకుండా...హరీశ్ రావు - ఆయన మేనమామ కూతురు కవిత ఒకే నియోజకవర్గంలో పర్యటించడం గమనార్హం.